ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రస్తుత ప్రపంచకప్‌లో పలు దేశాలలోని వేర్పాటువాద ఉద్యమాలకు సంబంధించిన నినాదాలు కనిపిస్తున్నాయి. జూన్ 29న పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్ మ్యాచ్ సందర్భంగా జస్టిస్ ఫర్ బలోచిస్తాన్ అనే నినాదంతో స్టేడియంపై విమానం వెళ్లిన విషయం తెలిసిందే.

దీంతో ఆగ్రహానికి గురైన ఇరు దేశాల అభిమానులు ఒకరిపై ఒకరు దాడికి దిగారు. ఈ సంఘటన మరచిపోకముందే మరో ఘటన జరిగింది. శనివారం లీడ్స్‌లో భారత్-శ్రీలంక మ్యాచ్ సందర్భంగా ‘‘జస్టిస్ ఫర్ కశ్మీర్’’ అనే నినాదం గల బ్యానర్‌తో ఒక బుల్లి విమానం స్టేడియం మీదుగా వెళ్లడం వివాదానికి దారి తీసింది.

దీనిపై అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణామండలి సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రపంచకప్‌ టోర్నీల వద్ద ఇలాంటి సందేశాల్ని తాము ఎట్టి పరిస్థితిలోనూ ఉపేక్షించబోమని ఆయన తెలిపారు.

ఇలాంటి ఘటనలను నివారించడానికి తాము స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చామని.. ఇటువంటి ఘటనలు మళ్లీ తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే సెమీఫైనల్స్ సందర్భంగా మాంచెస్టర్, బర్మింగ్‌హామ్‌లోని స్టేడియాలపై విమానాల రాకపోకలను నిషేధించేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపింది.

దీనిపై బీసీసీఐ సైతం స్పందించింది. ఇలాంటి ఘటనలను ఉపేక్షించేది లేదని... ఆటగాళ్ల భద్రతా ప్రమాణాలే తమకు ముఖ్యమంత్రి బీసీసీఐ అధికారి తెలిపారు.