వరల్డ్ కప్ హోరు చాలా హుషారుగా సాగుతోంది. ఇప్పటికే టీం ఇండియా సెమిస్ లో బెర్త్ కన్ఫామ్ చేసుకుంది. మంగళవారం బంగ్లాదేశ్ తో టీం ఇండియాతో జరిగిన మ్యాచ్ లో... ఆటగాళ్లకన్నా కూడా ఓ 87ఏళ్ల బామ్మ ఫేమస్ అయిపోయింది. నిజానికి... స్టేడియంలోని కెమేరాలన్నీ... క్రికెటర్ల మీదే దృష్టిపెడతాయి. ఎప్పుడైనా అందమైన అమ్మాయి కనపడితే.. వాళ్ల వైపు కెమేరా ఫోకస్ పడుతుంది. అలా ఫోకస్ పడి నెట్టింట సెలబ్రెటీలుగా మారిన అమ్మాయిలు చాలా మందే ఉన్నారు. అయితే... ఈసారి అమ్మాయి కాదు... 87ఏళ్ల బామ్మ పాపులర్ అయ్యింది. ఆమె చారులతా పాటిల్.

మ్యాచ్ మొత్తం ఆసక్తిగా తిలకిస్తూ.. బూర ఊదుతో ఆటగాళ్లను ఆమె ఉత్సాహపరిచారు. టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సైతం ఆమె పాదాలకు వందనం చేశారు. అయితే... ఆమె టీం ఇండియా సెమీ ఫైనల్స్, ఫైనల్ మ్యాచ్ లను కూడా వీక్షించి ఆటగాళ్లను ఉత్సాహ పరచాలని బిజినెస్ టైకూన్ ఆనంద్ మహీంద్ర అభిప్రాయపడ్డారు.

ఆ బామ్మ గురించి ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘‘ నాకున్న సెంటిమెంట్ ప్రకారం నేను మ్యాచ్ ని చూడను. కానీ ఈసారి మాత్రం కేవలం ఆ బామ్మను చూడటానికైనా టీవీ ఆన్ చేస్తాను. ఆమెను చూస్తుంటే మ్యాచ్ గెలిచినట్టే ఉంది’’ అని ట్వీట్ చేశారు.

కాగా.. ఈ మ్యాచ్ లో టీం ఇండియా 28 పరుగుల ఆధిక్యంతో గెలుపొందింది. మ్యాచ్ విజయానంతరం ఆనంద్ మహీంద్ర మరోసారి ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘‘ శభాష్ ఇండియా, వరల్డకప్ 2019లో టీం ఇండియా ఆడే సెమి ఫైనల్స్, ఫైనల్స్ లో కచ్చితంగా ఈ బామ్మ ఉండాలి. ఆమె మ్యాచ్ వీక్షించడానికి టికెట్ డబ్బులు నేను ఆఫర్ చేస్తాను’’ అంటూ ఆనంద్ మహీంద్ర పేర్కొన్నారు. 

‘ఆమె ఎవరో కనుక్కోని నాకు చెప్పండి. వరల్డ్ కప్ లో ఇండియా ఆడే అన్ని మ్యాచుల్లోనూ ఈ బామ్మకు ఉచితంగా టికెట్ ఇచ్చే బాధ్యత నాది’’ అంటూ ఆయన మరో ట్వీట్ లో పేర్కొన్నారు. కాగా ఆయన ట్వీట్ కి వేలసంఖ్యలో లైకులు రావడం గమనార్హం.