ప్రపంచకప్ లో వరస విజయాలతో దూసుకెళ్లిన టీం ఇండియా చిరవకు సెమీ ఫైనల్స్ లో వెనుదిరగాల్సి వచ్చింది. బుధవారం న్యూజిలాండ్ తో  జరిగిన మ్యాచ్ లో టీం ఇండియా 18 పరుగుల తేడాతో ఓటమి పాలయ్యింది. ఈ ఓటమిపై టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తీవ్ర బావోద్వేగానికి గురయ్యాడు. ట్విట్టర్ వేదికగా అభిమానులతో తన ఫీల్సింగ్స్ ని షేర్ చేసుకున్నాడు.

‘‘టీమిండియాకు మద్దతుగా నిలిచిన ప్రతి అభిమానికీ ముందుగా దన్యవాదాలు. ఈ టర్నీ మొత్తం మాకు అండగా నిలిచి మాకు గుర్తుండిపోయేలా చేశారు. మాపై ఎంతో ప్రేమ కురిపించారు. మేము కూడా నిరాశలోనే ఉన్నాం. మీ ఫీలింగ్స్ మాతో షేర్ చేసుకోండి. విజయం కోసం ఏమిచేయాలో అంతా చేశాం. జై హింద్’’ అంటూ ట్వీట్ చేశాడు.

అనంతరం మ్యాచ్ గురించి మాట్లాడుతూ... ధోనీ రనౌట్ కాకపోయి ఉంటే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేదని చెప్పాడు. కివీస్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారని చెప్పాడు. జడేజా అద్భుతమైన ప్రదర్శన కనపరిచాడన్నాడు. ధోనీతో విలువైన భాగస్వామ్యం జోడించాడు. ధోనీ ఇన్నింగ్స్ నిలబెట్టేందుకు చాలా ప్రయత్నించాడు. అని చెప్పాడు.