Asianet News TeluguAsianet News Telugu

ధోనీకి బీసీసీఐ మద్దతు.. ఐసీసీకి ముందే లేఖ

టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి బీసీసీఐ మద్దతుగా నిలిచింది. వరల్డ్ కప్ లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో  ధోనీ దేశభక్తిని చాటేలా ధరించిన చేతి గ్లౌజ్ లు వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. 

World Cup 2019: So BCCI has supported the 'logo' on Dhoni's gloves, permission sought by ICC
Author
Hyderabad, First Published Jun 7, 2019, 4:29 PM IST

టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి బీసీసీఐ మద్దతుగా నిలిచింది. వరల్డ్ కప్ లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో  ధోనీ దేశభక్తిని చాటేలా ధరించిన చేతి గ్లౌజ్ లు వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. 

ధోనీ ధరించిన గ్లౌజ్ లపై పాక్ మంత్రి ఒకరు అభ్యంతరం వ్యక్తం చేయడంతో... ఐసీసీ కూడా దీనిపై బీసీసీఐ ని ప్రశ్నించింది. నిబంధనల ప్రకారం ఇలాంటివి అనుమతించరాదని, బలిదాన్‌ గుర్తులు గల గ్లౌజులను ధోనీ ధరించకూడదని ఐసీసీ.. బీసీసీఐకి తెలియజేసింది. కాగా... ఈ విషయంలో బీసీసీఐ ధోనీకి మద్దతుగా నిలిచింది.

అయితే ధోనీ ఆ గ్లౌజులు ధరించేందుకు ఇంతకుముందే ఐసీసీ అనుమతి కోరామని బీసీసీఐ పాలకవర్గ చీఫ్‌ వినోద్‌రాయ్‌ పేర్కొన్నారు. ఐపీఎల్‌ ఛైర్మన్‌ రాజీవ్‌శుక్లా మాట్లాడుతూ ఈ అంశంపై ఐసీసీ అభ్యంతరం తెలపాల్సిన అవసరం లేదన్నారు. బలిదాన్‌ గుర్తులు కలిగిన గ్లౌజులను ధరించేందుకు ధోనీకి అనుమతివ్వాలని, ఇందులో ఎలాంటి వాణిజ్య అంశాలు లేవని, ఇది కేవలం జాతి గౌరవమని తెలిపారు. ఈ అంశంలో ఐసీసీకి ఎలాంటి అభ్యంతరాలు ఉండవని తాను భావిస్తున్నట్లు చెప్పారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios