టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ... రెండేళ్ల తర్వాత మళ్లీ బౌలింగ్ చేయడానికి సిద్ధమయ్యారు. గతంలో బౌలింగ్ చేసే కోహ్లీ... రెండేళ్ల క్రితం ఓ కారణం చేత బౌలింగ్ కి దూరమైన ఆయన వరల్డ్ కప్ సందర్భంగా బౌలింగ్ కి సిద్ధమౌతున్నారు. ఈ మేరకు నెట్ లో ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టారు. అయితే.. తాను బౌలింగ్ ని దూరంపెట్టడానికి గల కారణాన్ని తాజాగా కోహ్లీ ఓ మీడియా సంస్థకు వివరించారు.

2017లో శ్రీలంకతో జరిగిన ఓ మ్యాచ్‌లో భారత్ జట్టుకి అప్పటికే విజయం ఖాయమవడంతో నామమాత్రమైన ఓవర్లలో కోహ్లీ బౌలింగ్ చేసేందుకు ముందుకు వచ్చాడు. ఈ మేరకు అతను ధోనీ వద్ద నుంచి బౌలింగ్ కోసం బంతిని అడగ్గా.. అప్పుడు బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న జస్‌ప్రీత్ బుమ్రా ‘ఇక్కడ జోక్‌లు వేయకు.. ఇది ఇంటర్నేషనల్ మ్యాచ్’ అని గట్టిగా అరుస్తూ ఎగతాళి చేసినట్లు తాజాగా కోహ్లీ వెల్లడించాడు. 

బుమ్రా ఎగతాళి చేయడం... అదే సమయంలో కోహ్లీకి వెన్ను నొప్పి రావడంతో... బౌలింగ్ కి దూరమయ్యాడు. ఇప్పుడు మళ్లీ వరల్డ్ కప్ పుణ్యమాని.. అభిమానులకు  కోహ్లీ బౌలింగ్ చూసే అదృష్టం దక్కింది.