టీం ఇండియా మాజీ కెప్టెన్, సీనియర్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ పై పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్  షాకింగ్ కామెంట్స్ చేశాడు. ధోనీ కంప్యూటర్ కంటే వేగంగా ఉంటారని ప్రశంసలు కురిపించాడు. టీం ఇండియాలో ధోనీ లాంటి వ్యక్తి ఉంటడం ఆ జట్టుకి కొండంత బలం అని పేర్కొన్నారు. ఏ వికెట్‌ ఎలా మారుతుందోననే విషయంలో ధోని కంప్యూటర్‌కన్నా వేగంగా స్పందిస్తాడని అన్నాడు

అనంతరం  కేఎల్ రాహుల్ గురించి మాట్లాడుతూ... ‘ఒక క్రికెటర్‌గా కేఎల్‌ రాహుల్‌ అంటే ఇష్టం. అతను కోహ్లి అడుగు జాడల్లో నడుస్తున్నాడనిపిస్తోంది. భవిష్యత్‌లో అతనో గొప్ప బ్యాట్స్‌మన్‌ అవుతాడు. గతంలో ఓసారి కలిసినప్పుడు..  మైదానంలో వెలుపల ఇతర వ్యాపకాల పై దృష్టి పెట్టకుండా.. ఆటపైనే ఫోకస్‌ పెట్టాలని సూచించాను. రాహుల్‌కు మంచి భవిష్యత్‌ ఉంది’అన్నాడు.