ఇంగ్లాండ్ వేదికగా జరగుతున్న వరల్డ్ కప్ 2019లో నేడు టీం ఇండియా దక్షిణాఫ్రికాతో తలపడుతోంది. ఇప్పటికే దక్షిణాఫ్రికా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కాగా.... దక్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్స్ కి టీం ఇండియా స్టార్ పేసర్ బుమ్రా చుక్కలు చూపిస్తున్నాడు. 

అంచనాలకు మించి అతడి బౌలింగ్ సాగుతుండటంపై అతడిపై మాజీలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మంచి లైన్ అండ్ లెంగ్త్‌తో అద్భుతంగా బంతులేస్తున్నావని వీరేంద్ర సెహ్వాగ్ ట్విటర్‌లో స్పందించాడు. బుమ్రా సూపర్ స్పెల్‌తో చెలరేగిపోతున్నాడని హర్ష భోగ్లే ట్వీట్ చేశాడు. 

వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న బుమ్రా స్థాయికి తగ్గ ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. మైదానంలో అభిమానుల నుంచి కూడా టీమిండియాకు మంచి మద్దతు లభిస్తోంది. వరల్డ్ కప్ లో తొలి మ్యాచ్ కావడంతో... గెలవాలని టీం ఇండియా తాపత్రయపడుతుంటే... ఇప్పటికే రెండు మ్యాచ్ లు ఓడి ఉన్న దక్షిణాఫ్రికా... ఈ మ్యాచ్ తోనైనా శుభారంభం చేయాలని ఆశపడుతోంది.