భారత పేస్‌ బౌలర్‌ జస్ప్రీత్‌ బుమ్రా డోపింగ్ పరీక్షకు హాజరయ్యాడు. ప్రపంచకప్‌ ఆడుతున్న ఆటగాళ్లకు నిర్వహిస్తున్న డోపింగ్ టెస్ట్ లో భాగంగా సోమవారం బుమ్రాకు ప్రపంచ డోపింగ్‌ నిరోధక సంస్థ (వాడా) ఈ పరీక్ష నిర్వహించింది. అతని నుంచి మూత్రం శాంపిల్‌ను సేకరించింది. 

ఈ పరీక్షలు ఫలానా వాళ్లకు మాత్రమే నిర్వహించాలని ఏ నిబంధన లేదు..  ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ  తనకు నచ్చిన ఏ ఆటగాడినైనా పరీక్షించొచ్చు. ఈ క్రమంలోనే బుమ్రాకి పీరక్షలు నిర్వహించారు. దీని ఫలితం త్వరలోనే వెలువడనుంది.

 కాగా, సోమవారం జరిగిన టీమిండియా ప్రాక్టీస్‌ సెషన్‌లో రోహిత్‌ తీవ్రంగా ప్రాక్టీస్‌ చేశాడు. భారత బౌలర్లను రోహిత్‌ సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. చాహల్‌ బౌలింగ్‌లో భారీ షాట్లు ఆడాడు. అయితే, త్రోడౌన్‌లు ఆడే క్రమంలో బంతి రోహిత్‌ చేతికి బలంగా తాకడంతో కొంత ఆందోళన నెలకొన్నా.. ఆ తర్వాత నొప్పి తగ్గడంతో ప్రాక్టీస్‌ కొనసాగించాడు.