టీం ఇండియా విరాట్ కోహ్లీపై ఐసీసీ చేసిన ట్వీట్ ఇప్పుడు దుమారం రేపుతోంది. కోహ్లీ నెంబర్ వన్ అనే అర్థంతో... ఐసీసీ కోహ్లీ ఫోటో నెట్టింట షేర్ చేయగా... కొందరు దానిని తప్పు పడుతున్నారు.

ఇంతకీ మ్యాటరేంటంటే... విరాట్ కోహ్లీని ఓ చ‌క్ర‌వ‌ర్తిలా చూపిస్తూ బుధ‌వారం ఐసీసీ త‌న ట్విట్ట‌ర్ అకౌంట్‌లో ఓ ట్వీట్ చేసింది. సింహాస‌నంపై కోహ్లీ ఓ చ‌క్ర‌వ‌ర్తిలా కూర్చున్నాడు. ఒక చేతిలో బ్యాట్‌.. మ‌రో చేతితో బంతి.. కిరీటం స్థానంలో ఐసీసీ లోగోని ఏర్పాటు చేశారు. 

ఈ షోటో చూసి కోహ్లీ అభిమానులు సంబరపడుతుంటే... మరో వైపు విమర్శలు కూడా అదేస్థాయిలో వినపడుతున్నాయి.  ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ కూడా ఆ ట్వీట్‌పై రియాక్ట్ అయ్యారు. ఐసీసీ తీరును ఆయ‌న త‌ప్పుప‌ట్టారు. ఐసీసీ చేసిన ట్వీట్ నిష్ప‌క్ష‌పాతంగా లేదంటూ ఓ ట్వీట్ చేశారు. 

ఆ ట్వీట్‌కు ఐసీసీ కౌంట‌ర్ ఇచ్చింది. కోహ్లీ అన్ని ఫార్మాట్ల‌లో నెంబ‌ర్ వ‌న్ అంటూ మ‌రో ట్వీట్‌ను చేసింది. కింగ్ కోహ్లీ ఫోటోను ఐసీసీ స‌మ‌ర్థించుకుంది. వ‌న్డే, టెస్టు ర్యాంకింగ్స్‌లో కోహ్లీ నెంబ‌ర్ వ‌న్ అంటూ పేర్కొంది. కొన్ని స్క్రీన్ షాట్స్‌తో ఆ విష‌యాన్ని వెల్ల‌డించింది. మైఖేల్ వాన్ కి ఐసీసీ గట్టి వార్నింగ్ ఇచ్చిందంటూ... కోహ్లీ అభిమానులు ఆనందపడుతున్నారు. వరల్డ్ కప్ జరుగుగతున్న సమయంలో.. ఐసీసీ ఇలా ట్వీట్ చేయడం కొందరికి నచ్చడంలేదని తెలుస్తోంది.