ప్యారడైజ్ బిర్యానీ... పేరు చదువుతుంటూనే నోరు ఊరుపోతోంది కదా. అలాంటి బిర్యానీ సంవత్సరం పాటు ఉచితంగా పొందగలిగతే.. బిర్యానీ ప్రియులకు అంతకు మించి అదృష్టం ఏముంటుంది చెప్పండి. ఈ బంపర్ ఆఫర్ ని ప్యారడైజ్ అందిస్తోంది. 

వరల్డ్ కప్ నేపథ్యంలో... ఈ ఆఫర్ ప్రకటించింది. కాకపోతే... ఓ చిన్న కాంపిటేషన్ లో పాల్గొనాల్సి ఉంటుంది. అందులో విజేతలకు ఈ ఫ్రీ బిర్యానీ గెలుచుకునే అవకాశం ఉంటుంది. ఈ మేరకు ఓ ప్రకటనను కూడా విడుదల చేసింది.

#వ‌ర‌ల్డ్‌ క‌ప్‌విత్‌ప్యార‌డైజ్‌ పేరుతో జరిగే పోటీలో పాల్గొని ఏడాదిపాటు వారంలో ఒక బిర్యానీ చొప్పున 52 వారాలు ఉచితంగా, గిఫ్ట్ రూపంలో పొందవ‌చ్చ‌ని వెల్ల‌డించింది. ప్ర‌స్తుతం కొన‌సాగుతున్న వ‌ర‌ల్డ్‌క‌ప్ నేప‌థ్యంలో న‌గ‌రంలోని క్రికెట్ ప్రియుల కోసం ప్యార‌డైజ్ ఈ పోటీ ప్రకటించింది.
 
పోటీ వివరాల కోసం ప్యార‌డైజ్‌కు చెందిన ఫుడ్ కోర్టుల డైన్ ఇన్/ఎక్స్‌ప్రెస్ ఔట్‌లెట్‌ల‌లో సంప్రదించాలని తెలిపింది. కుటుంబ సభ్యులు, స్నేహితుల కలిసి తమ ఔట్‌లెట్‌లకు రావాలని కోరింది. ఈ క్రికెట్‌ సీజన్‌ తమ వినియోగదారులకు ప్రత్యేకంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈపోటీని తీసుకువచ్చినట్లు సంస్థ సీఈవో గౌతం గుప్తా తెలిపారు. మొన్నటి ఐపీఎల్‌ సందర్భంగా ప్యారడైజ్‌ రెగ్యులర్‌ కస్టమర్లకు ఉచితంగా బిర్యానీతో పాటు ఐపీఎల్‌ టికెట్లు అందజేసిన విషయం తెలిసిందే.