టీం ఇండియాకి ఇది చరిత్ర తిరగరాయాల్సిన సమయమని  క్రికెటర్ సురేష్ రైనా పేర్కొన్నారు. నేడు దక్షిణాఫ్రికాతో టీం ఇండియా వరల్డ్ కప్ పోరులో భాగంగా తలపడనున్న సంగతి తెలిసిందే. కాగా... మ్యాచ్ మొదలవ్వడానికే ముందు జట్టు సభ్యులకు రైనా బూస్టప్ ఇచ్చారు. ఎమోషనల్ గా టీం ఇండియాకి ఆల్ ద బెస్ట్ చెబుతూ ట్వీట్ చేశారు.

'ఇది రాస్తుంటే లక్షలకొద్ది భావోద్వేగాలు, ఎన్నో మధుర జ్ఞాపకాలు నా మదిలో స్పృశించాయి. హిస్టరీని తిరగరాయాల్సిన సమయం ఆసన్నమైంది. టీమ్‌ ఇండియా కప్‌ను భారత్‌ తీసుకురావాలి, గుడ్‌ లక్‌ అంటూ' ట్వీట్‌ చేశారు.కాగా... రైనా ట్వీట్ కి క్రికెట్ అభిమానులు వేల సంఖ్యలో స్పందిస్తున్నారు.

బుధవారం టీం ఇండియా దక్షిణాఫ్రికాతో తలపడనుంది. వరల్డ్ కప్ ప్రారంభమై వారం రోజులు గడుస్తున్నా... భారత్ తొలి మ్యాచ్ మాత్రం నేడే జరగనుంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఈ మ్యాచ్ కోసం ఎదురు  చూస్తున్నారు. టీం ఇండియా గెలవాలని, వరల్డ్ కప్ కూడా మనకే దక్కాలని భావిస్తున్నారు.