వరల్డ్ కప్ పోరులో  టీం ఇండియా రేస్ మొదలుపెట్టనుంది నేడే. సౌతాంప్టన్ లో ఈ రోజు టీం ఇండియా సౌతాఫ్రికాతో తలపడనుంది. కాగా...ఈ మ్యాచ్ లో కోహ్లీ తన సెంటిమెంట్ ని రిపేట్ చేస్తాడా అనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

 వ‌ర‌ల్డ్‌క‌ప్ మొద‌టి మ్యాచ్‌లో కోహ్లీకి సెంచ‌రీ కొట్ట‌డం అల‌వాటే. 2011లో, ఆ త‌ర్వాత 2015లోనూ.. కోహ్లీ సెంచ‌రీల‌తో టోర్నీలకు కిక్ ఇచ్చాడు. 2011లో బంగ్లాదేశ్‌తో జ‌రిగిన మొద‌టి మ్యాచ్‌లోనే కోహ్లీ సెంచ‌రీ చేశాడు. 2015 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లోనూ పాకిస్థాన్‌తో జ‌రిగిన మొద‌టి మ్యాచ్‌లో కోహ్లీ సెంచ‌రీ కొట్టాడు. 

దీంతో.. ఈ రోజు మ్యాచ్‌లో కోహ్లీ మ‌ళ్లీ సెంచ‌రీతో టోర్నీ ప్రారంభిస్తాడా అన్న‌దే ఇంట్రెస్టింగ్ పాయింట్‌. కోహ్లీ రెండు సెంచ‌రీలు చేసిన ఆ రెండు మ్యాచ్‌ల్లోనూ ఇండియా విక్ట‌రీ కొట్టింది. ఇవాళ సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో ఆ స్టంట్ రిపీట్ చేస్తే.. భార‌త్ విజ‌యం సాధించ‌డం అసాధ్య‌మేమీ కాదు.