హైదరాబాద్: ఓ యువకుడి చేతులు, కాళ్లు కట్టేసి గుర్తు తెలియని వ్యక్తులు అతనికి ఉరేశారు. ఈ సంఘటన హైదరాబాదు శివారులో జరిగింది. బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం ఈ సంఘటన వెలుగు చూసింది. 

దేవతలగుట్ట మార్గంలోని గేట్ కు ఓ యువకుడి శవం ఓ యువకుడి శవం వేలాడుతోందని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువకుడిని బాలాపూర్ బస్తీకి చెందిన ప్రశాంత్ (23)గా గుర్తించారు. 

ప్రశాంత్ కు తల్లిదండ్రులు లేరని, తన అన్న శ్రీకాంత్ వద్ద ఉంటున్నాడని పోలీసులు తెలిపారు. ఘటనపై మృతుడి అన్న శ్రీకాంత్ కు సమాచారం అందించారు. ప్రశాంత్ కు ఎవరితోనూ గొడవలు లేవని శ్రీకాంత్ పోలీసులకు చెప్పాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

ప్రేమ విఫలమై.....

ప్రేమించిన యువతి కాదడనంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన హైదరాబాదులోని సనత్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. బోరబండ శివాజీనగర్ కు చెందిన 22 ఏళ్ల వినోద్ ఓ సంస్థలో కొరియర్ బాయ్ గా పనిచేస్తున్నాడు. 

అతను ఓ యువతి ప్రేమలో పడ్డాడు. మనస్పర్థల కారణంగా ఇటీవల ఆమె అతన్ని పట్టించుకోలేదు. దీంతో అతను మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం రాత్రి ఫ్యాన్ కు ఉరేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.