భాగ్యనగరం కిర్తీ కిరీటంలో మరో కలికితురాయి చేరింది. ఏకకాలంలో లక్షమంది ధ్యానం చేసేలా నిర్మించిన అతిపెద్ద ధ్యాన కేంద్రం కన్హ శాంతివనం ఈ నెల 28న ప్రారంభం కానుంది. 

రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం చేగూరు గ్రామంలో నిర్మించిన ఈ కేంద్రాన్ని హార్ట్‌ఫుల్‌నెస్ అనే సంస్థ అత్యాధునిక వసతులతో దీనిని నిర్మించింది. ఈ సంస్థ అంతర్జాతీయ మార్గదర్శకులు దాజీ ఈ కేంద్రాన్ని మొదటి మార్గదర్శి లాలాజీ పేరిట అంకితం చేస్తారు.

Also Read:కొల్లాపూర్‌లో జూపల్లికి షాక్: మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డిదే పై చేయి

హార్ట్‌ఫుల్ ఇనిస్టిట్యూట్ 75వ వార్షికోత్సవం సందర్భంగా నవంబర్ 28న దీనిని ప్రారంభించనున్నారు. ఆ రోజున 40 వేల మందికి పైగా ఈ కేంద్రంలో ధ్యానం చేయనున్నారు. 29న ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్ దీనిని ప్రసంగించనున్నారు. వివిధ రాష్ట్రాల గవర్నర్లు, ప్రముఖులు ధ్యాన కేంద్రం ప్రారంభోత్సవానికి హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు.

మొత్తం 30 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ధ్యాన కేంద్రంలో ప్రధాన హాలు, ఎనిమిది సెకండరీ హాళ్లు ఉన్నాయి. వీటన్నింటిలో ఒకేసారి లక్షమంది ధ్యానం చేసుకోవచ్చు. 28 నుంచి 30 వరకు.. ఫిబ్రవరి 2 నుంచి 4 వరకు.. 7 నుంచి 9 వరకు మూడు దశలుగా జరిగే ధ్యాన శిబిరాల్లో 1.2 లక్షల మంది అభ్యాసకులు పాల్గొనే అవకాశం ఉంది.

Also Read:చంపేసి.. చనిపోయిందో లేదో మళ్లీ వచ్చి చెకింగ్: పథకం ప్రకారమే వారాసిగూడ బాలిక హత్య

ఫిబ్రవరి 2న జరిగే ధ్యాన శిబిరానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఫిబ్రవరి 7న ప్రముఖ సామాజికవేత్త అన్నాహజారే పాల్గొననున్నారు. హార్ట్‌ఫుల్‌నెస్ నిర్మాణం మొత్తం 1400 ఎకరాల స్థలంలో ఉంది.

40 వేలకు పైగా వసతి కల్పించడంతో పాటు.. రోజుకు లక్షమందికి వండి వార్చేలా వంట గదిని నిర్మించారు. ధ్యాన కేంద్రం ఆవరణలో సుమారు 6 లక్షల మొక్కలతో నర్సిరీని ఏర్పాటు చేశారు. త్వరలో 350 పడకల ఆయుష్ ఆస్పత్రి అందుబాటులోకి రానుంది.