హైదరాబాద్ మియాపూర్ లో ఓ మహిళను అత్యాచారం చేసి హత్య చేయడం కలకలం రేపింది. కొల్లూరు తాండాకు చెందిన ముగ్గురు వ్యక్తులు మహిళను హత్య చేసినట్టుగా తేలింది.

కొల్లూరు తాండాకు చెందిన ఓ మహిళ మూడు రోజుల క్రితం మియాపూర్ లోని తల్లిగారింటికి వచ్చింది. ఈమెకు ఇద్దరు సంతానం. సంఘటన జరిగిన రోజు దగ్గర్లోని షాపుకు వెడతానని ఇంటినుండి వెళ్లిందని స్థానికులు చెబుతున్నారు.

అక్కడినుండి ఆమె అదృశ్యం అయ్యింది. చివరికి మృతదేహంగా లభించింది. ఇది తెలిసిన వాళ్ల పనే అని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మహిళ భర్త కొన్నేళ్ల క్రితం మరణించాడు. మియాపూర్ నుంచి మహిళను నిందితులు కొల్లూరు తండాకు తీసుకుని వెళ్లినట్లు తెలుస్తోంది.

ముగ్గురు కూడా మహిళకు తెలిసినవాళ్లేనని సమాచారం. మద్యం తాగించి మహిళపై అత్యాచారం చేసినట్లు చెబుతున్నారు. మృతురాలు మహిళ కుటుంబానికి న్యాయం చేయాలని ఆందోళన జరిగింది. మహిళ ఫోన్ స్విచాఫ్ అయి ఉందని, ఎంతకీ ఆమె అందుబాటులోకి రాలేదని చెబుతున్నారు.