Asianet News TeluguAsianet News Telugu

మార్నింగ్ వాక్ కు వెళ్లి.. నాలాలో పడి మహిళ మృతి..

హైదరాబాద్ లో నాలాలు మృత్యుకుహరాలుగా మారుతున్నాయి. అదాటున ప్రాణాలు మింగేస్తున్నాయి. అజాగ్రత్తగా ఉంటే చాలు మనుషుల్ని మాయం చేస్తున్నాయి. తెరుచుకుని ఉన్న నాలా హైదరాబాద్ లో మరో మహిళను బలితీసుకుంది. మార్నింగ్ వాక్ కు వెళ్లిన ఆమె కానరాని లోకాలకు వెళ్లిపోయింది. 

Woman Death After falls in the open drain while morning walk hyderabad - bsb
Author
Hyderabad, First Published Nov 3, 2020, 11:32 AM IST

హైదరాబాద్ లో నాలాలు మృత్యుకుహరాలుగా మారుతున్నాయి. అదాటున ప్రాణాలు మింగేస్తున్నాయి. అజాగ్రత్తగా ఉంటే చాలు మనుషుల్ని మాయం చేస్తున్నాయి. తెరుచుకుని ఉన్న నాలా హైదరాబాద్ లో మరో మహిళను బలితీసుకుంది. మార్నింగ్ వాక్ కు వెళ్లిన ఆమె కానరాని లోకాలకు వెళ్లిపోయింది. 

అధికారులు నిర్లక్ష్యం మార్నింగ్ వాక్ కు వెళ్లిన ఆమె పట్ల మృత్యువుగా మారింది. సరూర్ నగర్ చెరువు కింద ఉన్న శారదా నగర్ కి చెందిన సరోజ తెల్లవారుజామున ఉదయం ఆరుగంటలకు ఇంటి నుంచి వాకింగ్‌కు వెళ్లారు. కనిపించలేదో, కాలు జారిందో తెలియదు కానీ ప్రమాదవశాత్తు నాలాలో పడి కొట్టుకుపోయారు. 

గమనించిన స్థానికులు వెంటనే అధికారులకు తెలిపారు. సమాచారం అందుకున్న స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి హుటాహుటిన ఎన్‌డీఆర్‌ఎఫ్‌ టీమ్‌ను, పోలీసులను, జీహెచ్‌ఎంసీ సిబ్బందిని అప్రమత్తం చేసి గాలింపు చర్యలు చేపట్టారు. అప్పటికే ఆలస్యం కావడంతో ఆమె మృతి చెందారు. చైతన్యపురిలోని హనుమాన్‌నగర్ నాలలో మృతదేహం లభ్యంమైంది. 
మృతదేహాన్ని వెలికితీసిన సిబ్బంది పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కాగా ఇటీవల హైదరాబాద్‌ నగరంలో భారీగా వర్షాలు కురవడంతో నాలాలు ప్రమాదకరంగా మారిన విషయం తెలిసిందే. 

ఇక తాజా ఘటన నేపథ్యంలో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి ప్రమాదాలు వరుసగా సంభవిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios