హైదరాబాద్: అమెరికా కాన్సుల్ జనరల్ జోయల్ రీఫ్ మాన్ బుధవారం నాడు పరిశ్రమలు, ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటి రామారావుతో మర్యాదపూర్వకంగా కలిసారు. ఇవాళ మసాబ్ ట్యాంక్ లోని పురపాలక భవనంలో మంత్రిని ఆయన కలిశారు. రెండోసారి మంత్రిగా పదవీభాద్యతలు స్వీకరించినందుకు కెటిఆర్ కు కాన్సుల్ జనరల్ శుభాకాంక్షలు తెలిపారు

హైదరాబాద్లో ప్రస్తుతం ఉన్న అమెరికన్ పెట్టుబడులు, భవిష్యత్తు పెట్టుబడి అవకాశాలను ఇరువురు చర్చించారు. దేశంలోని ఇతర మెట్రో నగరాలకు ధీటుగా నగరం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు మంత్రి కెటిఆర్. వివిధ రంగాల్లో ఉన్న వ్యాపార, వాణిజ్య అవకాశాలను మంత్రి కెటీఆర్ వివరించారు. గత కాన్సుల్ జనరల్ క్యాథరీన్ హడ్డా బదిలీ అనంతరం నూతన కాన్సుల్ జనరల్ గా జోయల్ రీఫ్ మాన్ భాద్యతలు స్వీకరించారు. 

కాన్సుల్ జనరల్ తోపాటు కాన్సులర్ ఛీఫ్  ఏరిక్ అలగ్జాండర్, ఎకానమిక్ స్పెషలిస్ట్  క్రిష్టెన్ లోయిర్ లు మంత్రిని కలిసిన బృందంలో ఉన్నారు. ఈ సమావేశంలో మంత్రులు ప్రశాంత్ రెడ్డి, సత్యవతి రాథోడ్ లు కూడా ఉన్నారు.

"