రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు మరణించారు. ఆదివారం హిమాయత్ సాగర్‌ సర్వీస్ రెడ్డుపై ఇద్దరు దంపతులు వారి చిన్నారితో కలిసి బైక్‌పై వెళుతున్నారు.

ఈ క్రమంలో వేగంగా దూసుకొచ్చిన కారు వీరి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భార్యభర్తలిద్దరూ అక్కడికక్కడే  మరణించగా..చిన్నారి తీవ్రంగా గాయపడింది.

బైక్‌ను ఢీకొట్టిన వెంటనే పక్కనే  వున్న కాలువలోకి కారు దూసుకెళ్లింది. సమాచారం అందుకున్న పోలీసులు కారులో ప్రయాణిస్తున్న యువకులతో పాటు చిన్నారిని నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు.

కాగా కారును నడిపింది మైనర్ బాలుడని.. ఇతనితో పాటు మరో ఇద్దరు మైనర్లు కారులో ఉన్నారని పోలీసులు తెలిపారు. అతి వేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. మృతుడిని మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన నాగరాజుగా గుర్తించారు.