తప్పిపోయిన బాలిక  గంటల్లోనే పట్టుకుని తల్లికి అప్పగించారు చైతన్యపురి పోలీసులు .వివరాల్లోకి వెళితే  శనివారం మధ్యాహ్నం మారుతి నగర్ లో   3 సంవత్సరాల చిన్నారి తప్పిపోయింది. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రలు వెంటనే డయిల్ 100కు ఫోన్ చేసి   పోలీసులకు విషమాన్ని తెలిపారు.  

తక్షణమే స్పంధించిన   చైతన్యపురి పి‌ఎస్ పోలీసులు  గంటల వ్యవధిలోనే బాలికను గుర్తించి తల్లికి అక్కున చేర్చారు. కానిస్టేబుల్ శ్రీధర్, హోం గార్డ్స్ నర్సింహా, రమేశ్ లు పాప అచూకి  తెలుసుకుని తల్లికి అప్పగించారు. అయితే ఇంట్లో ఉన్న ఆ చిన్నారి ఆడుకుంటూ  బయటకు వెళ్ళిపోయింది. ఈ విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించలేదు. 

వారు తెలుసుకునే లోపు చిన్నారి కనిపించకుండాపోయింది, చూట్టూ పక్కల అంత వెతికిన అచూకి లంభించలేదు. దీంతో ఆందోళన చెందిన పాప తల్లిదండ్రులు డయిల్ 100కు ఫోన్  చేసి పాప తప్పిపోయిన విషయాన్ని తెలియజేశారు.

సమాచారం తెలుసుకున్న  పోలీసులు  పాప వెతికి పట్టుకున్నారు. ఓ కిరాణా షాప్ వద్ద ఉన్న చిన్నారిని గుర్తించి బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు. తమ చిన్నారిని తమ వద్దకు చెర్చినందుకు గాను పాప తల్లిదండ్రులు పోలీసులకు  కృతజ్ఞతలు  తెలిపారు.