హైదరాబాద్ మల్కాజిగిరీలో పూజల కోసం గుడికి వచ్చిన బాలిక మీద ఓ అర్చకుడు అసభ్యంగా ప్రవర్తించాడు. విషయం తెలిసిన కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా సోమవారం అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

వివరాల్లోకి వెడితే మల్కాజిగిరీ ఠాణా పరిధిలోని ఓ గుడిలో చింతపల్లి వేంకటేశ్వర శర్మ అనే అర్చకుడు విధులు నిర్వర్తిస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన పదహారేళ్ల అమ్మాయి గత కొద్ది రోజులుగా అమ్మవారి దీక్ష తీసుకుని పూజలు చేస్తోంది. 

అయితే అమ్మాయి మీద కన్నేసిన పూజారి ఆదివారం నాడు ప్రత్యేక పూజలు చేయించాలని చెప్పాడు. దీంతో ఆదివారం సాయంత్రం అమ్మయి గుడికి వచ్చింది. ఆమెకు ఏవో మాత్రలు ఇచ్చాడు పూజారి. రాత్రి నగ్నంగా పూజలు చేయాలని, రాత్రికి రావాలని చెప్పి పంపాడు. 

ఇంటికి వచ్చిన కాసేపటికే అమ్మాయి వాంతులు చేసుకోవడంతో ఏమైందని కుటుంబసభ్యలు ప్రశ్నించారు. దీంతో విషయం చెప్పింది. వెంటనే వారు పోలీసులను ఆశ్రయించారు. పూజల పేరుతో అమ్మాయిని లొంగదీసుకోవాలని ప్రయత్నించిన పూజారిని అదుపులోకి తీసుకున్నారు.