Asianet News TeluguAsianet News Telugu

కలుపు తీసే యంత్రాన్ని కనుగొన్న 17 ఏళ్ల విద్యార్ధి, కేటీఆర్ ప్రశంసలు

తక్కువ ఖర్చుతో మరియు పోర్టబుల్ వరి కలుపును తీసే కనిపెట్టినందుకు యువ ఆవిష్కర్త అశోక్‌ను మంత్రి కెటిఆర్ ప్రశంసించారు.

telangana minister ktr praises young innovator ashok
Author
Hyderabad, First Published Nov 9, 2019, 7:54 PM IST

తక్కువ ఖర్చుతో మరియు పోర్టబుల్ వరి కలుపును తీసే కనిపెట్టినందుకు యువ ఆవిష్కర్త అశోక్‌ను మంత్రి కెటిఆర్ ప్రశంసించారు. ప్రగతి భవన్‌లో తెలంగాణ రాష్ట్ర చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ ఫనీంద్ర సామ, యువ ఆవిష్కర్త అశోక్ మంత్రి కేటీఆర్‌ను శనివారం కలిశారు.

వ్యవసాయ రంగానికి ఇలాంటి ఆవిష్కరణలు ఎక్కువ అవసరమని కేటీఆర్ తెలిపారు. ఈ సందర్భంగా అశోక్‌కు పూర్తి సహాయం అందించాలని ఫణింద్ర సామాను మంత్రి ఆదేశించారు.

సూర్యాపేట జిల్లాకు చెందిన 17 ఏళ్ల అశోక్‌కు కోల్‌కతాలోని విజ్ఞాన భారతి (VIBHA) సహకారంతో సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ 2019 (ఐఐఎస్ఎఫ్) లో జరిగిన స్టూడెంట్స్ ఇంజనీరింగ్ మోడల్ పోటీలో వ్యవసాయ రంగాల విభాగంలోమొదటి బహుమతి లభించింది.

Also Read:ఆర్టీసీకి మరో షాక్:రూ. 760 కోట్ల పీఎఫ్ తాఖీదు

అశోక్ ప్రస్తుతం ఇంటర్మీడియట్ చదువుతున్నాడు మరియు అదే సమయంలో దేవర్‌కొండ వొకేషనల్ కాలేజీలో ఒకేషనల్ అగ్రికల్చర్ కోర్సును అభ్యసిస్తున్నాడు. ముఖ్యంగా చిన్న రైతుల కోసం, సమస్యలను పరిష్కరించగల మరిన్ని ఆవిష్కరణలను చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు.

తెలంగాణలో ప్రధానంగా పండించే పంటలలో వరి ఒకటి. కలుపు మొక్కలను తొలగించడానికి మహిళలు నిరంతరం వంగి ఉండాలి, ఇది చాలా కష్టమైన పని. కొన్నిసార్లు కలుపు మొక్కలు లోతైన మూలాలతో ఎక్కువ కాలం పెరుగుతాయి, ఇవి పనిని మరింత కష్టతరం చేస్తాయి.

రాష్ట్రంలో మరియు దేశవ్యాప్తంగా ఈ సమస్యను గుర్తించిన అశోక్ తక్కువ ఖర్చుతో అతిచిన్న  వరి  చేలో  కలుపును తీసే యంత్రాన్ని కనుగొన్నాడు. అశోక్ ఇప్పటివరకు మూడు ఆవిష్కరణలు చేయడం జరిగింది. చెవిటివారికి ఉపయోగపడే విధంగా నిర్ణీత సమయంలో వాసనను విడుదల చేసే అలారం యంత్రాన్ని కనుగొన్నారు.

Also Read:టీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్యకు పదో తరగతి విద్యార్థిని గోరుముద్దలు

మరొక ఆవిష్కరణ చిన్న రైతుల కోసం ఒక బహుళార్ధసాధక హ్యాండ్‌టూల్, ఇది పత్తి మరియు మిరప పంటలలో కలుపు తీయడం, వరి ధాన్యాలు సేకరించడం మరియు కట్టలను తయారుచేయడం మొదలైన పనులను తక్కువ ఖర్చుతో  చేస్తుంది.

తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ (టిఎస్ఐసి) మరియు పల్లె సృజన ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా వివిధ ప్రదర్శనలలో అశోక్ ఆవిష్కరణలను ప్రదర్శించడం జరిగింది

Follow Us:
Download App:
  • android
  • ios