తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బతుకమ్మ ఆర్ట్ వర్క్ షాప్ నేటితో ముగిసింది. మూడు రోజుల పాటు సాగిన ఈ ఆర్ట్ వర్క్ షాప్ లో మహిళా చిత్రకారిణులు 50 మంది పాల్గొని రంగు రంగుల బతుకమ్మ ఇంద్రధనుస్సులు ఆవిష్కరించారు.

ఆర్ట్ వర్క్ షాప్ ముగింపు ఉత్సవంలో  ముఖ్య అతిథిగా మహిళా శిశు సంక్షేమ శాఖామంత్రి శ్రీమతి  సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ఔన్నత్యాన్ని చూపేటట్లుగా బతుకమ్మను బతుకు చిత్రంగా చూపారని ప్రశంసించారు.

కేసీఆర్ నాయకత్వంలో బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించడంతో పాటు ఆడబిడ్డలకు చీరలు అందచేస్తున్నారని సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు.

నమస్తే తెలంగాణ ఎడిటర్ కట్టా శేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ సాంస్కృతిక పతాక బతుకమ్మ అని ప్రకృతిని ఆరాధించే మహోన్నత వారసత్వం బతుకమ్మ అన్నారు. బతుకమ్మ గొప్పదనాన్ని ఆవిష్కరించేందుకు ఇంతమంది ఆడ బిడ్డలు ఒక చోట చేరడం మంచి విషయమని ఆయన కొనియాడారు.