మల్కాజ్‌గిరి జిల్లా మేడ్చల్ మండలం పూడూరు గ్రామంలో శుక్రవారం తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కుమార్తె నీత, అనూప్‌ల వివాహం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన సతీమణి శోభ దంపతులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

సీఎం వెంట మంత్రులు జగదీష్ రెడ్డి, ఎంపీలు జోగినిపల్లి సంతోష్ కుమార్, రంజిత్ ఉన్నారు. 2017 జూన్‌లో ఈటల కుమారు నితిన్ వివాహం క్షమితతో మాదాపూర్‌లోని హైటెక్స్‌లో జరిగిన సంగతి తెలిసిందే.