హైదరాబాద్: మద్యం మత్తులో ఓ వ్యక్తి అత్యంత నీచమైన కార్యానికి ఒడిగట్టాడు. అత్తపై సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయిన అల్లుడు అత్యాచారం చేశాడు. దానిపై భార్య అతన్ని నిలదీసింది. దాంతో తనను క్షమించాలని వేడుకున్నాడు. విడాకులు, భరణం ఇస్తానని చెప్పాడు. 

దారుణానికి ఒడిగట్టి భార్యతో గొడవ పడిన తర్వాత అతను ఇంట్లోంచి వెళ్లిపోయాడు. తర్వాత తిరిగి రాలేదు. ఈ సంఘటన హైదరాబాదులోని పంజగుట్టలో జరిగింది. కేరళలోని పాలక్కడ్ కు చెందిన ఓ మహిళ శ్రనగర్ కాలనీలో అల్లుడు, కూతుళ్లతో ఉంటోంది.  అల్లుడు, కూతురు కూడా సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు. రాత్రి పూటలో విధులు నిర్వహిస్తున్నారు. వారికి రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. కూతురు, అల్లుడు ఆఫీసుకు వెళ్తే బాలుడి బాగోగులు ఆమె చూసుకునేది. 

నవంబర్ 13వ తేదీిన విధులకు వెళ్లకుండా ఇంట్లో మద్యం సేవించాడు. అదే మత్తులో నిద్రపోతున్న అత్తపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తర్వాత రోజు ఆమె ఏడుస్తుండగా కూతురు ప్రశ్నించింది. దాంతో ఆమె జరిగిన విషయం కూతురికి చెప్పింది. భార్య వెంటనే బంధువులను పిలిపించి భర్తను నిలదీసింది.

తప్పయింది, క్షమించండని అతను వేడుకున్నాడు. ఆ తర్వాత ఇంట్లోంచి వెళ్లిపోయాడు. ఇప్పటి వరకు తిరిగి రాలేదు. దాంతో అతని భార్య, అత్త శుక్రవారం పంజగుట్ట పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.