హైదరాబాద్: ఓ ఎస్సై భార్యను పక్కన పెట్టి మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దాంతో మహిళతో భర్త ఉన్న ఇంటి వద్ద ఎస్సై నర్సింహ భార్య ఆందోళనకు దిగింది. హైదరాబాదులోని నాచారం పోలీసు స్టేషన్ పరిధిలో గల మల్లాపూర్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది. 

మహేశ్వరం ఎస్సైగా పనిచేస్తున్న నర్సింహకు మరో మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో మహిళ ఇంటి వద్ద బంధువులతో కలిసి నర్సింహ భార్య ఆందోళనకు దిగింది. 

తన భార్యను, బంధువులను చూసిన నర్సింహ అక్కడి నుంచి పారిపోయాడు. ఈ కేసులో నర్సింహ సస్పెండ్ అయ్యాడు. నర్సింహ భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.