ఉస్మానియా విశ్వవిద్యాలయం సమగ్ర అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు ఇన్‌ఛార్జి వీసీ అర్వింద్ కుమార్. బుధవారం ఆయన లేడిస్ హస్టల్ వద్ద లెడ్ లాంప్ లను స్విచ్ ఆన్ చేసి లాంఛనంగా ప్రారంభించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సబులిటి కింద పది లక్షల వ్యయం తో లేడీస్ హస్టల్ క్లష్టర్ మొత్తం సరిపోయే విధంగా దాదాపు 1.75కిలోమీటర్లు పరిధిలో ఈ బల్బులును ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా యంబి ఇల్యుమినేషన్ ఇంజనీరింగ్ ప్రతినిధులను వీసీ అభినందించారు. దానితో పాటు లేడీస్ హస్టల్ లో రక్షణ కొరకు సీసీ కెమెరాలు,కంచె లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఇంతేకాకుడా ప్రఖ్యాతి గాంచిన ఆర్ట్స్ కా లేజ్, యునివర్సిటీ లైబ్రరీ లు సర్వాంగ సుందరంగా కనిపించే విధంగా ప్రత్యేక లైటింగ్ సిస్టమ్ ను ఏర్పాట్లు చేయడానికి తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆయన అధికారులకు సూచించారు.

విశ్వవిద్యాలయం లో పచ్చదనం పెంచే లక్ష్యంగా యునివర్సిటీ, ఉద్యానవన శాఖల అధికారులు సంయుక్తంగా పనిచేస్తున్నారని అర్వింద్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్   ప్రొఫెసర్ రెడ్డి,  ప్రొఫెసర్ కృష్ణా రెడ్డి ఆర్ట్స్, సైన్స్ కాలేజీ ల ప్రిన్సిపాళ్ళు రవిందర్,ప్రతాప్ రెడ్డి,యునివర్సిటీ ఉన్నాధికారులు హరిసింగ్ నాయక్,నిర్మల,భిక్ష్మా,రాజేందర్ నాయక్,యంబి ఇల్యుమినేషన్  ఇంజనీరింగ్ ప్రతినిధులు కునాల్,గణేష్, నితిన్ తదితరులు పాల్గొన్నారు.