హైదరాబాద్: ఇంటి యజమాని, అతని స్నేహితుల చేతుల్లో సామూహిక అత్యాచారానికి గురైన తల్లీకూతుళ్ల వాంగ్మూలాలను పోలీసులు రికార్డు చేశారు. హైదరాబాదులోని చందాగనర్ లో అద్దెకు దిగిన మహిళపై, ఆమె కూతురిపై ఇంటి యజమాని, అతని స్నేహితులు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు కేసు నమోదైన విషయం తెలిసిందే. 

ఇంటి యజమాని, అతని స్నేహితులు మద్యం తాగి వచ్చారని బాధితురాలు చెప్పింది. చికెన్ కూరలో ఏం పెట్టారో తెలియదని, అది తినగానే తాము స్పృహ తప్పి పడిపోయామని ఆమె చెప్పింది. ఆ తర్వాత నేరానికి పాల్పడినట్లు తెలిపింది. 

Also Read: హైదరాబాద్ లో దారుణం...తల్లీ కూతుళ్లపై గ్యాంగ్ రేప్, ఇంట్లో అద్దెకు దిగినవారే

పోలీసుల వద్దకు వెళ్లవద్దని, ఖర్చయితే తాను పెట్టుకుంటానని ఇంటి యజమాని ఆ తర్వాత తనకు ఫోన్ చేసి చెప్పాడని బాధితురాలు చెప్పింది. ఎవరూ లేని సమయంలో తమ ఇంటికి మహిళలను తీసుకుని వచ్చేవాడని ఆమె చెప్పింది. 

హైదరాబాదులోని చందానగర్ పాపిరెడ్డి కాలనీలో ఓ వివాహిత తన కుమారుడు, కూతురుతో కలిసి ఓ ఇంట్లో అద్దెకు ఉంటోంది. ఆమెపై కన్నేసిన ఇంటి యజమాని పథకం ప్రకారం వ్యవహరించి తల్లీకూతుళ్లపై స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు. 

Also Read: విశాఖలో దారుణం: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను చంపేశాడు

మత్తుపదార్థాలు కలిపిన ఆహారపదార్థాలు తినడం వల్ల ముగ్గురు కూడా అస్వస్థతకు గురయ్యారు. తల్లీకూతుళ్లను ఉస్మానియా ఆస్పత్రిలో చేర్చగా, కుమారుడు నిలోఫర్ లో చేర్చారు. నిందితులు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.