హైదరాబాద్: తల్లి కూతుళ్లపై కొందరు మృగాళ్లు సామూహిక అత్యాచారానికి పాల్పడిన దారుణం హైదరాబాద్ లో చోటుచేసుకుంది. ఆహారంలో మత్తుమందు కలిపి తల్లీకూతుళ్లపై ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. బాధిత కుటుంబానికి బాగా తెలిసిన వారే ఈ దారుణానికి పాల్పడినట్లు సమాచారం. 

హైదరాబాద్ మహానగరంలోని చందానగర్ పాపిరెడ్డి కాలనీలో ఓ వివాహిత కొడుకు, కూతురితో కలిసి ఓ ఇంట్లో అద్దెకుంటోంది. అయితే ఆమెపై కన్నేసిన ఆ ఇంటి యజమాని తన స్నేహితులతో కలిసి తల్లీ కూతురిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. 

చికెన్ లో మత్తుపదార్థాలు కలిపి ఆ కుటుంబానికి అందించగా తెలిసినవాడు కావడంతో తీసుకుని ఆ కుటుంబం ఆరగించారు. దీంతో ఆ కుటుంబం సృహ కోల్పోగా అప్పటికే మద్యంమత్తులో వున్న ఇంటి ఓనర్ తో పాటు ముగ్గురు స్నేహితులు తల్లీ కూతుళ్లపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. 

read more  విశాఖలో దారుణం: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను చంపేశాడు

అయితే మత్తు పదార్థాలు కలిసిని ఆహారం తినడంతో పాటు సామూహిక అత్యాచారం కారణంగా తల్లీకూతుళ్లు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిద్దరికి ఉస్మానియా హాస్పిటల్ లో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఇద్దరి ఆరోగ్య పరిస్థితి విషమంగానే వున్నట్లు సమాచారం. బాధితురాలి కొడుకు నీలోఫర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి పరిస్థితి కూడా ఆందోళనకరంగానే వున్నట్లు తెలుస్తోంది. 

ఈ దారుణంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులు ప్రస్తుతం  పరారీలో వున్నట్లు తెలుస్తోంది. వారి కోసం ప్రత్యేక పోలీస్ బృందాలు గాలింపు ప్రారంభించినట్లు సమాచారం.