Asianet News TeluguAsianet News Telugu

సుందరయ్యపార్కు ముందు జామకాయలు అమ్ముతున్న నీట్‌ విద్యార్థిని.. కారణమిదే..

నీట్ లో 843వ ర్యాంకు విద్యార్థి ఒకరు హైదరాబాద్ లోని సుందరయ్య పార్కు దగ్గర ఆర్గానిక్ జామకాయలు అమ్ముతూ ఆరోగ్యం మీద అవగాహన కల్పిస్తోంది. 

NEET Best Student Selling Guava Fruits In Sundarayya Park  - bsb
Author
Hyderabad, First Published Nov 5, 2020, 11:49 AM IST

నీట్ లో 843వ ర్యాంకు విద్యార్థి ఒకరు హైదరాబాద్ లోని సుందరయ్య పార్కు దగ్గర ఆర్గానిక్ జామకాయలు అమ్ముతూ ఆరోగ్యం మీద అవగాహన కల్పిస్తోంది. 

ఆమె ఉన్నతమైన కుటుంబంలో పుట్టింది. నీట్‌లో మంచి ర్యాంక్‌ సాధించింది. అయినా... తమ తోటలో పండే ఆర్గానిక్‌ జామకాయలను విక్రయిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది.

ఉస్మానియా మెడికల్‌ కాలేజీలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్‌ మాచర్ల రామన్న బర్కత్‌పురలో నివాసముంటున్నారు. ఈయన కూతురు అశ్రిత. తల్లి  టాటా కన్సల్టెన్సీలో ఉద్యోగం చేస్తుంది.  

డబ్బుకు ఎలాంటి లోటు లేదు అయినప్పటికి అశ్రిత ఏ విధమైన బిడియం లేకుండా బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్యపార్కు ముందు ఆర్గానిక్‌ జామకాయలు విక్రయిస్తూ ఆదర్శంగా నిలుస్తుంది. 

అశ్రిత ఇటీవల వెలుపడ్డ నీట్‌ పరీక్షా ఫలితాల్లో 843వ ర్యాంక్‌ సాధించి శభాష్‌ అనిపించుకుంది. ఎటువంటి బిడియం లేకుండా పార్కుల ముందు తమతోటలో కాసే జామకాయలను విక్రయిస్తూ మన్నన పొందుతోంది. 

రోజూ ఏదో ఒక పార్కు ముందు  జామకాయలను విక్రయిస్తోంది. హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ అశ్రితకు ప్రత్యేకంగా ఫోన్‌ చేసి అభినందనలు తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios