హైదరాబాద్:తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి ఎన్టీఆర్ అని ఎన్టీఆర్ ట్రస్ట్  మేనేజింగ్ ట్రస్టీ  నారా భువనేశ్వరి చెప్పారు.

బుధవారం నాడు ఎన్టీఆర్ కాలేజీలో నిర్వహించిన ప్రెషర్స్ డేలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 2015లో ఈ కాలేజీని స్థాపించినట్టుగా ఆమె గుర్తు చేశారు. ఎన్టీఆర్  జ్ఞాపకార్థం ఈ కాలేజీని స్థాపించినట్టుగా ఆమె చెప్పారు.

 చదువుతో పాటు విలువలను కూడ ఈ కాలేజీలో నేర్పుతామన్నారు. చదువుకు మార్కులు ఒక్కటే కాదన్నారు. పెద్దల పట్ల గౌరవం, ఎదుటివారి పట్ల ప్రేమాభిమానాలను విద్యార్దులు చాటి చెప్పాలని ఆమె కోరారు.

ఉద్యోగాల కోసం వెతుక్కొనే వారికంటే ఉద్యోగాలను ఇచ్చే వారిగా ఎదగాలని ఆమె విద్యార్ధులకు నొక్కి చెప్పారు.పలు రకాలైన కోర్సులను ఈ కాలేజీలో అందిస్తున్నట్టుగా భువనేశ్వరీ గుర్తు చేశారు.ఈ కోర్సులను సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.మీ మీద మీకు నమ్మకం ఉంటే ఏదైనా సాధించవచ్చని ఆమె విద్యార్ధులకు చెప్పారు.

"