తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గురువారం మింట్ కాంపౌండ్‌లో జరిగిన బతుకమ్మ వేడుకల్లో మంత్రి సత్యవతి రాథోడ్ పాల్గొని మహిళలతో కలిసి ఆడి పాడారు.

అటు టీఆర్ఎస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో తెలంగాణ భవన్‌లో బతుకమ్మ వేడుకల్లోనూ సత్యవతి పాల్గొన్నారు.  బతుకమ్మను పేర్చి, అందులో గౌరమ్మను ఉంచి పాటలు పాడుతూ చిందులేశారు.

కార్యక్రమమంతా సందడి సందడిగా సాగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.... తుకమ్మ తెలంగాణకు అత్యంత ప్రీతిపాత్రమైన పండుగనీ, రాష్ట్రంలోని ప్రతి మహిళ పండుగ సందర్భంగా నూతన వస్ర్తాలు ధరించాలనే ఉద్ధేశ్యంతో ప్రభుత్వం బతుకమ్మ చీరలను పంపిణీ చేసిందని మంత్రి అన్నారు.  

ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ స్పీకర్‌, మెదక్‌ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌ రెడ్డి, టీఆర్‌ఎస్‌ మహిళా విభాగం అధ్యక్షురాలు గుండు సుధారాణి, కరీంనగర్‌ మాజీ జెడ్పీ చైర్మన్‌ తుల ఉమ, పార్టీ మహిళా కార్పోరేటర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు