మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండాదే విజయమని ఆర్థిక మంత్రి హరీష్ రావు ఆశాభావం వ్యక్తం చేశారు. ఆదివారం మంత్రి  హరిష్ రావు నివాసంలో గజ్వేల్ పట్టణం మరియు రూరల్ మండల వ్యాప్తంగా  FDC చైర్మెన్  వంటేరు ప్రతాప్ రెడ్డి  ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు తెరాస తీర్థం పుచ్చుకున్నారు.  

Also Read:మంత్రి పదవి కన్నా.. వర్కింగ్ ప్రెసిడెంట్‌కే నా ఓటు: కేటీఆర్

మంత్రి  హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి  వారికి తెరాస కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. పార్టీలో ప్రతి ఒక్కరికి ప్రేత్యేక గుర్తింపు ఉంటుందని , కష్టపడి  పార్టీ కోసం పనిచేయాలన్నారు. అతి త్వరలోనే కాళేశ్వరం నీళ్లు మీ భూముల్లో తడవడం ఖాయం అని పంటపొలలాన్ని సస్యశ్యామలంగా మారుతాయని మంత్రి వెల్లడించారు.

Also Read:హైదరాబాద్ నగర వాసులకు కోతుల బెడద నుండి శాశ్వత పరిష్కారం ఎప్పటికి దొరుకునో...?

పార్టీలో చేరిన వారిలో గుంటుకు మల్లేశం మాజీ జడ్పీటీసీ పిడిచేడ్ నర్సింహ చారి ,మాజీ జడ్పీటీసీ గాలంఖ నర్సింలు ,సీనియర్ కాంగ్రెస్ నాయకులు  రాజిరెడ్డి ,జలిగామ ఎంపీటీసీ హనుమంత రెడ్డి , చెంద్రయ్య, మాజీ ఎంపీటీసీ సత్యనారాయణ , బ్రహ్మచారి మహేష్ చారి , లక్ష్మీ నారాయణ, ప్రభాకర్ శ్యామ్ సుందర్, శ్రీనివాస్ చారి తదితరులు చేరినవారిలో ఉన్నారు...

Also Read:తెలంగాణ మునిసిపల్ ఎన్నికలు : రాష్ట్ర ఎన్నికల అధికారి నాగిరెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు

ఈ కార్యక్రమంలో తెరాస సీనియర్ నాయకులు మాదాసు శ్రీనివాస్ , గాడిపల్లి భాస్కర్ ఎంపీపీ అమరావతి జడ్పీటీసీ మల్లేశం మండల అధ్యక్షుడు బెండే మధు , గుంటుకు రాజు నవాజ్ రమేష్ గౌడ్ విరసత్ అలీ మతిన్ హన్మంత రెడ్డి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు..