ముఖ్యమంత్రి అధికార నివాసం ప్రగతి భవన్‌లో గన్‌మెన్ గా పనిచేస్తున్నానని చెబుతూ పలువురిని మోసం చేసిన సంతోష్ కేసులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రగతి భవన్ లో సబ్–ఇన్‌స్పెక్టర్‌గా నకిలీ ఐడీతో మోసం చేస్తున్న ఎన్. సంతోష్ అనే వ్యక్తిని శనివారం వెస్ట్‌జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
ముఖ్యమంత్రి అధికార నివాసం ప్రగతి భవన్‌లో గన్‌మెన్ గా పనిచేస్తున్నానని చెబుతూ పలువురిని మోసం చేసిన సంతోష్ కేసులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రగతి భవన్ లో సబ్–ఇన్‌స్పెక్టర్‌గా నకిలీ ఐడీతో మోసం చేస్తున్న ఎన్. సంతోష్ అనే వ్యక్తిని శనివారం వెస్ట్‌జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
రేతిబౌలి, ఖదీర్‌బాగ్‌కు చెందిన ఎన్.సంతోష్ టెన్త్ వరకు మాత్రమే చదివాడు. కొన్నాళ్లు ఓ సివిల్ కాంట్రాక్టర్ దగ్గర ఎలక్ట్రీషియన్‌గా పని చేసి ఆ తరువాత కారు డ్రైవర్‌గా మారాడు.
సిటీలోని ఓ కారు రెంటల్ సంస్థకు తన ఆధార్, రెండు ఖాళీ చెక్కులు ఇచ్చి కారు అద్దెకు తీసుకునేవాడు. దీన్ని దూరప్రాంతాలకు నడుపుతుండేవాడు.
అలా గతంలో సమాచార హక్కు చట్టం ప్రధాన కార్యాలయంలో పని చేసే ఓ అధికారి వద్ద కాంట్రాక్ట్ పద్దతిలో డ్రైవర్‌గా పని చేశాడు. ఈ నేపథ్యంలో ఇతడికి సఫారీ డ్రస్ వేసుకోవడం అలవాటు కావడంతో ఇప్పటికీ కొనసాగిస్తూ వచ్చాడు.
కొద్ది రోజుల క్రితం సంతోష్ కారును బుక్ చేసుకున్న ఓ ఆరెస్సై టోల్‌గేట్స్ వద్ద తన గుర్తింపు కార్డు చూపిస్తూ టోల్ నుండి మినహాయింపు పొందాడు. ఇది చూసిన సంతోష్ తన దగ్గర కూడా ఇలాంటి కార్డు ఉంటే తానూ టోల్ ట్యాక్స్ తప్పించుకుంటే, ప్రతీ ట్రిప్‌లో రూ.వెయ్యి వరకు లాభపడచ్చని అనుకున్నాడు.
ఆ ఆరెస్సై గుర్తింపుకార్డును ఫొటో తీసుకుని, ఫొటోషాప్ తో తన పేరు, ఫొటో మార్చాడు. సఫారీ సూట్, దీనికి తోడు నకిలీ ఐడీ ఇంకేం సంతోష్ సూడో పోలీసుగా మారాలనుకున్నాడు. దీనికి తోడు అమెజాన్ నుంచి పిస్టల్ ఆకారంలో ఉన్న సిగరెట్ లైటర్‌ను కొన్నాడు
మరోసారి ఓఆర్‌ఆర్ మీదుగా వెళ్తూ... అక్కడ డ్యూటీలో ఉన్న పోలీసుల చేతుల్లో వాకీటాకీలు చూసి, చూసిస్తానంటూ వాటిని పట్టుకుని ఫొటోలు దిగాడు. ఆ తరువాత సీఎం కేసీఆర్ తన బాడీగార్డ్స్ తో దిగిన ఫొటోను ఇంటర్‌నెట్ నుంచి డౌన్‌లోడ్ చేశాడు. అందులో తన ఫోటో మార్ఫింగ్ చేసి అతికించాడు.
తన ఫోన్‌లో స్నేహితులు, బంధువుల నంబర్లను ‘కలెక్టర్ ఆఫీస్, సీఎం 2, సీఎం క్యాంప్ ఆఫీస్, సీబీఐ రవీంద్ర’ పేర్లతో సేవ్ చేసుకున్నాడు. దీంతో వారు కాల్ చేసినప్పుడు ఈ పేర్లే వచ్చేవి. స్నేహితులతో కూర్చున్నప్పుడు ఈ కాల్స్ వస్తే భారీ బిల్డప్ ఇచ్చేవాడు. వీటితో తాను ప్రగతి భవన్‌లలో పని చేస్తున్న గన్‌మెన్ అని అనేక మందికి పరిచయం చేసుకున్నాడు. ఉద్యోగాలు, రుణాలు ఇప్పిస్తానంటూ అనేక మంది నుంచి డబ్బు వసూలు చేశాడు. ఒత్తిడి చేసిన వారికి తిరిగి చెల్లించేశాడు.
ఈ మోసాలు బైట పడడంతో సంతోష్ ను జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించిన లంగర్‌హౌస్ పోలీసులు తదుపరి విచారణ నిమిత్తం కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణయించారు.
