హైదరాబాద్ గచ్చిబౌలిలో పదహారేళ్ల బాలిక అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. బుధవారం ఉదయం గచ్చిబౌలి మసీదుబండ సమీపంలో బాలిక మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసుల విచారణలో ఆ బాలిక వనపర్తికి చెందిన మొగులయ్య, పద్మ దంపతుల కుమార్తె నాగేశ్వరిగా తేలింది.

ఆమె నిన్న సాయంత్రం నుంచి కనపించడం లేదని తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నాగేశ్వరి మరణం వెనుక కారణాలను ఆరా దర్యాప్తు చేస్తున్నారు. 

కొద్దిరోజుల క్రితం మచిలీపట్నంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కనిపించింది. స్థానికులను ఒక్కసారిగా షాక్ గురి చేసిన ఈ ఘటన  జిల్లా కోర్ట్ సెంటర్ సాయిబాబా గుడి సమీపంలో చోటుచేసుకుంది. డ్రైనేజిలో శవం కనిపించడంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు.

పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనపై విచారణ మొదలుపెట్టారు. వివరాల్లోకి వెళితే.. జిల్లా కోర్ట్ సెంటర్ సాయిబాబా గుడి సమీపంలోని డ్రైనేజిలో ఒకవ్యక్తి మృతదేహం కొట్టుకురావడం స్థానికులు గమనించారు.

వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న చిలకలపూడి పోలీసులు. మృతుల వివరాల కోసం దర్యాప్తు చేపట్టారు. పోలీసులు మద్యం మత్తులో డ్రైనేజీ లో పడి సదరు వ్యక్తి చనిపోయి ఉంటాడని భావిస్తున్నారు.