Kanchi Peetadhipathi: కంచి పీఠాధిపతి జగద్గురువులు శ్రీ విజయేంద్ర సరస్వతి మహా స్వామివారికి మంగళవారం హైదరాబాద్‌కు విచ్చేసిన సందర్భంగా ఘన స్వాగతం లభించింది. తెలుగు లలిత కళాతోరణంలో కంచి కామకోటి పీఠాధిపతికి డాక్టర్ కె.ఐ.వర ప్రసాద్ రెడ్డి నేతృత్వంలోని గురు స్వాగత సత్కార స్వీకరణ కమిటీ వారికి స్వాగతం పలికింది. ఈ సమయంలో భారీ సంఖ్యలో భక్తులు, వేదపండితులు జగద్గురువు విజయేంద్ర సరస్వతి స్వామి వారికి ప్రణామాలు అర్పించారు.
Kanchi Peetadhipathi: కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురువులు శ్రీ విజయేంద్ర సరస్వతి మహా స్వామి (Kanchi Peetadhipathi Jagadguru Sri Vijayendra Saraswsthi Mahaswamy) హైదరాబాద్ లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికారు. నాంపల్లి లోని లలిత కళా తోరణంలో ఆయనకు స్వాగతసభను ఏర్పాటు చేశారు. కంచి కామకోటి పీఠం 70వ పీఠాధిపతికి డాక్టర్ కె.ఐ.వర ప్రసాద్ రెడ్డి నేతృత్వంలోని గురు స్వాగత సత్కార స్వీకరణ కమిటీ స్వాగతం పలికింది. ఈ సమయంలో భారీ సంఖ్యలో భక్తులు, వేదపండితులు జగద్గురువు విజయేంద్ర సరస్వతి స్వామి వారికి ప్రణామాలు అర్పించారు.స్వాగత సత్కార కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి వివిధ పండితులు వేద స్వస్థితో ప్రారంభించారు.
అనంతరం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,, సనాతన ధర్మం, జగద్గురువులు శ్రీ ఆదిశంకరులు గురించి వివరించారు. జీవితంలో లలితత్వం ఉండాలని, జీవితంలో తత్వాన్ని తెలుసుకోవాలని ప్రవచించారు. మనమందరం భారత భూమిలో జన్మించడం ఎంత అదృష్టమో అని వివరించారు.
మనిషి మనిషిగా ఉండాలనీ, విదేశాల్లో మన భావం ఉంది కాని ఇక్కడ అభావం ఉందని అన్నారు. అది చేయడానికి ప్రతి మనిషి కృషి చేయాలని, ధర్మాన్ని ప్రతి ఒక్కరూ కాపాడాలని, మన సంస్కృతి కి వైజ్ఞానికం అవసరమని సూచించారు.
గత రెండేళ్ల లో వాక్సిన్స్ ఇచ్చే స్థితికి చేరామని, మన రెండు రాష్ట్రాలు విదేశాల్లో మందులు పంపిణీ చేసే విధంగా ఎదిగిందని తెలిపారు. ఈ సందర్భంగా.. గత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. 1967,68,69 లో రెండు తెలుగురాష్ట్రాల్లో పర్యటించాననీ, మళ్ళీ ఇప్పుడు పర్యటిస్తున్నని గుర్తుకు చేసుకున్నారు. ఆనాడు కాళహస్తి, విజయవాడ విశాఖ పట్నం లో సభలు నిర్వహించామనీ, పీవీ నరసింహారావు కూడా ఆ రోజుల్లో వచ్చారనీ, సేవా ప్రముఖులుగా కొంతమంది పనిచేశారని అన్నారు.
ఆనాడు సభలు నిర్వహించి పుష్కరాల్లో పాల్గొని స్ఫూర్తిని తీసుకొచ్చారని అన్నారు. గతంలో చాతుర్మాస్య కార్యక్రమం కర్నూల్ లో నిర్వయించామనీ, ఇలా అనేక కార్యక్రమాలు చేసామని, అలా కంచికి రెండు రాష్ట్రాలకు అనుబంధం ఏర్పాటైందని విజయేంద్ర సరస్వతి అన్నారు. స్కందగిరి ఆలయంలో మూల విరాట్ కి స్వర్ణ బంధం జరగబోతోంది రెండు రోజుల కార్యక్రమం ఉంది. గత 20 ఏళ్ల కింద్ర తెలంగాణ లో సిద్దిపేట, బాసర, వర్గల్ లాంటి ప్రదేశల్లో తిరిగాననీ, మళ్ళీ ఇప్పుడు వచ్చానని దాంతో ధర్మ ప్రచారం జరుగుతోందని, ఇది శుభపరిణామని అన్నారు.
