హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు మధ్య మంగళవారం నాడు అసెంబ్లీలో మాటల యుద్ధం చోటు చేసుకొంది. మంత్రి తలసానికి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కౌంటరిచ్చారు.

మంగళవారం నాడు హైద్రాబాద్ అసెంబ్లీలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సెటైర్లు వేశారు. అన్నదమ్ములిద్దరికి పబ్లిసిటీ పిచ్చి. ఎప్పుడు ఏం మాట్లాడుతారో తెలియదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నెల రోజుల తర్వాత కన్పించకుండా పోతారని  ఆయన విమర్శలు చేశారు.

ఈ తరుణంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు  ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలో చేరి మంత్రి కాలేదని ఆయన కౌంటరిచ్చారు.