హైదరాబాద్: రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో ఇన్ఫోసిస్ పోచారం సెంటర్ హెడ్ మనీషా సబూ కూడా భాగస్వాములయ్యారు. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ విసిరిన చాలెంజ్ స్వీకరించిన మనీషా మంగళవారం మూడు మొక్కలు నాటారు. 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ఎంపీ సంతోష్ గ్రీన్ ఛాలెంజ్ పేరుతో గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. ఇలాంటి గొప్ప పనిలో తనను భాగస్వామ్యం చేసిన ఎంపీకి, సిపి మహేష్ భగవత్ కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

 

ఈ సందర్భంగా ఆమె కూడా మరొక ముగ్గురికి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఇన్పోసిస్ చెన్నై వైస్ ప్రెసిడెంట్ ఎంఎస్ సౌర్య,  బెంగళూరు సెంటర్ హెడ్  గురు రాజ్ దేశ్ పాండే, ZenQ సీఈవో మురళి బోళ లను మొక్కలు నాటాలని కొరారు.