హైదరాబాద్: రెండో భార్య కూతురిపై అత్యాచారం చేసిన వ్యక్తిని హైదరాబాదు సమీపంలోని మైలార్ దేవ్ పల్లి పోలీసులు అరెస్టు చేశారు. 11 ఏళ్ల బాలికపై అతను అత్యాచారం చేశాడు. నిందితుడికి మొదటి భార్య ద్వారా ఎనిమిది కూతుళ్లు, ముగ్గురు కుమారులు ఉన్నారు.

నిందితుడు భర్తతో విడాకులు తీసుకున్న మహిళను కొన్ని మాసాల క్రితం పెళ్లి చేసుకున్నాడు. ఈమెకు ముగ్గుగురు కూతుళ్లు ఉన్నారు. నిందితుడు నవంబర్ 8వ తేదీనన బాలికను హసన్ నగర్ లోని తన ఇంటి నుంచి తీసుకుని వెళ్లి నవంబర్ 16వ తేదీన మైలార్ దేవ్ పల్లిలోని ఆమె తాత ఇంట్లో దింపాడు. 

బాలిక అస్వస్థతతో కనిపించడంతో కుటుంబ సభ్యులు ఆమెను నీలోఫర్ ఆస్పత్రికి తీసుకుని వెళ్లారు. తన సవతి తండ్రి తనపై అత్యాచారం చేశాడని బాలిక వైద్యులకు చెప్పింది. దాంతో నవంబర్ 20వ తేదీన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు శుక్రవారంనాడు నిందితుడిని అరెస్టు చేశారు.