గత నెలలో బంజారాహిల్స్ జరిగిన భారీ చోరీ కేసును హైదరాబాద్ పోలీసులు ఛేదించారు. నిందితుడు ఆరిఫ్‌ను పోలీసులు బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. ఇతనిపై 16 రాష్ట్రాల్లో కేసులు ఉన్నాయని.. ఆయా రాష్ట్ర పోలీసులు ఇతని కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారని తెలిపారు.

ఎంపీ సుబ్బరామిరెడ్డి అన్న కొడుకు ఉత్తమ్ రెడ్డి ఇంట్లోకి ఆగస్టు 27న చొరబడిన ఆరిఫ్ .. రెండు కోట్ల విలువైన బంగారాన్ని ఎత్తుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. 
నిత్యం రద్దీగా ఉండటంతో పాటు సెక్యూరిటీ కూడా ఉన్న ప్రాంతాల్లో దోపిడి జరగడం కలకలం రేపింది.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు  సీసీ కెమెరా పుటేజీ సాయంతో నిందితుడిని గుర్తించి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. గురువారం ఆరిఫ్‌ బెంగళూరులో ఉన్నట్లుగా గుర్తించి అక్కడి పోలీసుల సాయంతో అదుపులోకి తీసుకున్నారు.