సికింద్రాబాద్ సమీపంలోని బోయిన్‌పల్లిలో జరిగిన భారీ చోరీ కసును పోలీసులు చేధించారు. అత్తపై పగ తీర్చుకోవడానికి మెట్టింట్లోనే దొంగతనం చేసిన కోడలిని పోలీసులు అరెస్ట్ చేశారు.

వివరాల్లోకి వెళితే.. కామారెడ్డికి చెందిన కొల్లూరి శ్రీనివాస్ తన కుమార్తె సుప్రియను పాత బోయిన్‌పల్లి మల్లిఖార్జున‌నగర్‌కు చెందిన వడ్డీ వ్యాపారి సరళ కుమారుడు ధీరజ్‌తో నాలుగు నెలల క్రితం పెళ్లి చేశారు.

పెళ్లయిన కొద్దిరోజులకే సుప్రియ, ధీరజ్‌ల మధ్య తీవ్రస్థాయిలో అభిప్రాయ భేదాలు వచ్చాయి. ఇక తన జీవితం ఇక బాగుపడదని భావించిన సుప్రియ ధీరజ్ విషయంపై అత్తను ప్రశ్నించి పుట్టింటికి వెళ్లిపోయింది.

Also Read:పండగపూట హైదరాబాద్‌లో చెడ్డీగ్యాంగ్ కలకలం.. హయత్‌నగర్‌లో చోరీలు

దసరా పండుగకు మెట్టినింటికి వచ్చిన సుప్రియ ధీరజ్ విషయంపై అత్తను మరోసారి ప్రశ్నించినా ఆమె బదులివ్వలేదు. దీంతో సుప్రియ తల్లిదండ్రుల వద్దకు తిరిగి వచ్చేసింది. వచ్చేటప్పుడు ఇంటి తాళాలను తీసుకొచ్చింది.

అత్తపై ప్రతీకారం తీర్చుకుంటానని, సహకరించాలని సోదరుడు, తల్లిదండ్రులను కోరింది. కూతురి ఆనందం కోసం వారు అంగీకరించారు. ఇందుకోసం అత్తింటికి కన్నం వేయాలని భావించి నకిలీ తాళం చెవిని సృష్టించింది.

ప్లాన్‌లో భాగంగా ఈ నెల 21న హైదరాబాద్ వచ్చింది. సరళ ఇంటి పరిసరాల్్లో మాటువేసి.. ఆమె బయటకి వెళ్లిన వెంటనే తల్లిదండ్రులు, సోదరుడు సాత్విక్ సాయంతో నకిలీ తాళం చెవితో లోపలికి ప్రవేశించింది.

Also read:video : నూజివీడు తుమ్మలవారి వీధిలో భారీ చోరీ

బంగారు ఆభరణాలు, వెండిని సంచిలో వేసుకుని.. దీనిని దొంగతనంగా చిత్రీకరించేందుకు గాను దుస్తులను చిందరవందర చేశారు. పడకగది తలుపు తెరిచి.. బయటకు వచ్చేటప్పుడు గుమ్మం దగ్గర ద్వారానికి గడియ పెట్టకుండా వదిలేసి పరారయ్యారు.

బయట పనిముగించుకుని ఇంటికి వచ్చిన సరళ బంగారు ఆభరణాలు, నగదు కనిపించకపోవడంతో అదే రోజు రాత్రి బోయిన్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు దొంగతనం జరిగిన తీరును పరిశీలించి దర్యాప్తు ముమ్మరం చేశారు.

ఈ క్రమంలో ఆ ఇంటి కోడలు సుప్రియే ఈ చోరీకి సూత్రధారిగా గుర్తించి ఆమెతో పాటు సహకరించిన తల్లిదండ్రుడు శ్రీనివాస్,  సునీత, సోదరుడు సాత్విక్‌లను అదుపులోకి తీసుకున్నారు.

నిందితుల నుంచి 2 కిలోల బంగారం, 6.75 కిలోల వెండి వస్తువుల, కారు, నాలుగు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆరు రోజుల్లోనే కేసును ఛేదించిన పోలీసు సిబ్బందని హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్ అంజనీకుమార్ అభినందించారు. 

దీపావళీ పండుగపూట హైదరాబాద్‌లో చెడ్డీగ్యాంగ్ రెచ్చిపోతోంది. హయత్‌నగర్ సమీపంలోని కుంట్లూరు ప్రాంతంలో చెడ్డీగ్యాంగ్ సంచారం అలజడి రేపుతోంది. మూడు రోజుల సమయంలో రెండు దొంగతనాలు చేయడంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.

ప్రజల సమాచారంతో రంగంలోకి దిగిన రాచకొండ పోలీసులు చెడ్డీగ్యాంగ్‌ను పట్టుకునేందుకు వేట ముమ్మరం చేశారు. కుంట్లూరులోని ఓ వీధిలో సంచరిస్తున్న చెడ్డీగ్యాంగ్‌ సీసీటీవీ కెమెరాలకు చిక్కడంతో ఆ దృశ్యాల సాయంతో ఐదుగురు సభ్యుల ముఠాను పోలీసులు గుర్తించారు.

వీరి కోసం నాలుగు బృందాలను ఏర్పాటు చేసిన రాచకొండ పోలీస్ కమీషనరేట్ వీలైనంత త్వరగా చెడ్డీగ్యాంగ్‌ను పట్టుకునేందుకు గాలిస్తోంది.