హైదరాబాద్ మెట్రో రైల్ కార్పోరేషన్ మందుబాబులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. మద్యం సేవించిన వారికి మెట్రో రైలులో అనుమతిస్తున్నట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ప్రకటించారు. అయితే దీని వెనుక అసలు మ్యాటర్ ఏంటంటే.. న్యూఇయర్ వేడుకల సందర్భంగా ప్రయాణీకుల సౌకర్యార్థం మెట్రో పనివేళలను అర్థరాత్రి ఒంటిగంట వరకు పొడిగించారు.

ఈ క్రమంలో మద్యం సేవించిన వారికి సైతం అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు. అయితే ఆ సమయంలో ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదని, ఒకవేళ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినచర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

Also Read:ఆదిలాబాద్ జిల్లాలో బాంబు పేలుడు: ఒకరి మృతి, మరోకరికి గాయాలు

హైదరాబాద్‌లో ప్రతి సంవత్సరం న్యూఇయర్ వేడుకల సందర్భంగా ప్రతి ఏటా ఘోర రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. వీటి కారణంగా ఎంతోమంది ప్రాణాలను కోల్పోయిన సంగతి తెలిసిందే.

దీనిపై దృష్టి పెట్టిన హైదరాబాద్ మెట్రో అధికారులు ఆ చర్యలను చేపట్టినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత రోజు నుంచి మెట్రో రైళ్లు ఉదయం 6.30 నుంచి రాత్రి 11 గంటల వరకు నడుస్తాయని ఆయన ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.

Also Read:జగన్‌కు కేటీఆర్ కితాబు,ఏపీకి మూడు రాజధానులపై ట్విస్ట్

మరోవైపు ఎంఎంటీఎస్ సర్వీసులను సైతం మంగళవారం అర్థరాత్రి వరకు పొడిగించారు. అర్థరాత్రి 1.30కి లింగంపల్లి-ఫలక్‌నూమా ఎంఎంటీఎస్, అర్థరాత్రి 1.15కి లింగంపల్లి-హైదరాబాద్‌ ఎంఎంటీఎస్ నడుస్తాయని అధికారులు తెలిపారు.