హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ ఆరు మాసాల పాలన చాలా బాగుందని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ ఆర్నెళ్ల పాలన బాగుంది, మంచి ప్రారంభం అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.  ఏపీకి మూడు రాజధానులు మంచిదో కాదో ఆ రాష్ట్ర ప్రజలే నిర్ణయిస్తారన్నారు. ఈ విషయాన్ని నిర్ణయించేంది తాను కాదన్నారు.

తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆదివారం నాడు పలు సమస్యలపై ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాలను పంచుకొన్నారు. ట్విట్టర్‌లో ఆస్క్ కేటీఆర్ పేరుతో పలు ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు.  నెటిజన్లు పలు అంశాలపై కేటీఆర్‌ను ప్రశ్నించారు. 

ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటు చేయడంపై మీ అభిప్రాయం ఏమిటీ, రాజధాని నగరం, హైకోర్టు ఇవేనా అభివృద్ధఇ అంటే అని నెటిజన్ కేటీఆర్ ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు కేటీఆర్ తెలివిగా సమాధానం చెప్పాడు. ఈ విషయాలను నిర్ణయించేది తాను కాదన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలని ఆయన సమాధానం ఇచ్చారు.