హైదరాబాద్: 60 ఏళ్ల యాచకురాలిపై ఇద్దరు మద్యం తాగించి గ్యాంగ్‌రేప్ కు పాల్పడ్డారు.ఈ ఘటన హైద్రాబాద్ మల్కాజిగిరిలో చోటు చేసుకొంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

హైద్రాబాద్ మల్కాజిగిరికి చెందిన 50 ఏళ్ల చిన్నప్ప, 53 ఏళ్ల విజయ్‌కుమార్ లు ఈ నెల 17వ తేదీన మద్యం సేవించారు. రోడ్డు పక్కన కూర్చొన్న యాచకురాలితో మాటలు కలిపారు. తమ ఇంటికి తీసుకెళ్లి ఆమెకు మద్యం తాగించారు.

మద్యం తాగిన తర్వాత ఆమె స్పృహా కోల్పోయింది. స్పృహా కోల్పోయిన తర్వాత బాధితురాలిపై ఇద్దరు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. బాధితురాలు స్పృహాలోకి వచ్చిన తర్వాత ఆమె కేకలు వేసింది. బాధితురాలి కేకలు విన్న స్థానికులు పోలీసులకు ఫోన్ చేశారు.

పోలీసులు వచ్చే సమయానికి నిందితులు పారిపోయారు. బాధితురాలిని ఆసుపత్రిలో చేర్పించి పోలీసులు చికిత్స అందించారు. మరో వైపు నిందితులను శనివారం నాడు పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని రిమాండ్ కు పంపారు.