దేవాలయాలను లక్ష్యంగా చేసుకొని చోరీకి పాల్పడుతున్న నలుగురు దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు.   తెలంగాణ ఆలయాల్లో చోరీ చేసి దాదాపు 11 కేసుల్లో దొరకకుండా తిరుగుతున్న నలుగురు దొంగలను రాచకొండ పోలీసులు పట్టుకున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళితే...  హైదరాబాద్ లోని ఎల్బీనగర్ కి చెందిన నర్సింహ(23), సారయ్య(19), రమేష్(22),భద్రాచలం కు చెందిన జగదీష్(21) లు ఏపీలోని పలు దవాలయాల్లో చోరీ చేసినట్లు పోలీసులు చెప్పారు. వీళ్లంతా తూర్పుగోదావరి జిల్లాకి చెందినవారు కాగా... తెలంగాణలో దొంగతనాలు చేయడానికి ఇక్కడికి వచ్చారు.

పోలీసుల విచారణలో నిందుతు తమ నేరాన్ని అంగీకరించారు. వాళ్లు ఖమ్మం, ఎల్బీనగర్ లోని పలు ఆలయాల్లో కూడా దొంగతనాలు చేసినట్లు వారు తెలిపారు. కేవలం భద్రత లేని ఆలయాలను టార్గెట్ చేసుకొని చోరీలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. మొత్తంగా రాచకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదు కేసులు, ఖమ్మం జిల్లాలో ఐదుకేసులు వీరిపై నమోదయ్యాయి. ఉప్పల్ లో బైక్ చోరీ కేసు కూడా వీరి పేరి మీద నమోదయ్యింది.

భద్రత లేని ఆలయాల్లోకి ప్రవేశించి హుండీలు పగలకొట్టి భక్తులు సమర్పించిన నగదు, స్వామివారి బంగారం చోరీ చేసేవారు. అనంతరం అక్కడి నుంచి చాకచక్యంగా తప్పించుకునేవారు. చిరవకు పోలీసులకు చిక్కారు. వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు పోలీసులు  చెప్పారు.