హైదరాబాద్: భార్యపై కోపంతో భర్త అత్యంత దారుణానికి పాల్పడ్డాడు. భార్యతో అతను గొడవ పడ్డాడు. దీంతో ఆమెపై కక్ష పెంచుకున్నాడు. దాన్ని మనసులో పెట్టుకుని ఆమె ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. 

భార్య ఫొటోను అనుచిత రీతిలో పోస్టు చేసిన భర్తను పోలీసులు అరెస్టు చేశారుడు. జాన్ జార్జ్ అలియాస్ సన్నీ గత మూడేళ్లుగా కుషాయిగుడా ఈసీఐఎల్ లోని రాధికా థియేటర్ లో ప్రొజెక్టర్ ఆపరేటర్ గా పనిచేస్తున్నాడు. అతను కుటుంబంతో కలిసి దమ్మాయిగూడలోని లక్ష్మీనగర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. 

ఇటీవలి కాలంలో భార్య అతనితో గొడవ పడుతూ వస్తున్నాడు. దాంతో ఆమెను నలుగురిలో అల్లరిపాలు చేయాలని అనుకున్నాడు. ఆమె తన స్నేహితురాళ్లతో దిగిన ఫొటోలను షేర్ చాట్ చేశాడు. ఆ ఫొటోలో ఉన్నవాళ్లంతా కాల్ గర్ల్స్ అంటూ కామెంట్ పెట్టాు. వాయిస్ కూడా ఇచ్చాడు. 

ఆ ఫొటో కింద భార్య ఫోన్ నెంబర్ పెట్టాడు. దాంతో గుర్తు తెలియని వ్యక్తుల నుంచి అతడి భార్యకు ఫోన్ కాల్స్ వస్తూ ఉన్నాయి. దీంతో బాధితురాలు శనివారం రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు టెక్నికల్ డేటా ఆధారంగా నిందితుడు సన్నీని శనివారం అరెస్టు చేశారు.