హైదరాబాద్‌ను భారీ వర్షం ముంచెత్తింది. మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల ధాటికి నగరంలోని ప్రధాన ప్రాంతాలు జలమయమయ్యాయి.

బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, పంజాగుట్ట, అమీర్ పేట్, ఎర్రగడ్డ, ఎస్ ఆర్ నగర్, మూసాపేట, ఖైరతాబాద్, కోఠి, ఉప్పల్, కూకట్ పల్లి ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.

వర్షం కారణంగా రోడ్లు జలమయ్యాయి.. శ్రీనగర్ కాలనీలో చెట్టు విరిగిపడటంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. మరోవైపు తెలంగాణ మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ తెలిపింది.