హైదరాబాద్: సికింద్రాబాదులోని నేరేడ్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డిఫెన్స్ కాలనీలో నివాసం ఉంటున్న  అమిలియా అనే వృద్ధురాలి ఇంట్లో ఈ నెల 30వ తేదీన ఒక దొంగతనం జరిగినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది.     

ఫిర్యాదు అందుకున్న పోలీసులు జరిపిన విచారణ సాగించారు. ఫిర్యాదురాలి మనమరాలు పెట్రిసియా (21) యువతి ఈ దొంగతనానికి పాల్పడ్డట్లు పోలీసులు నిర్ధారించారు. నిందితురాలు పెట్రిసియా కు నేరేడ్మెట్ కి చెందిన అజయ్ అనే యువకుడితో గత రెండు సంవత్సరాలుగా  ప్రేమలో పడింది.   

చెడు వ్యసనాలకు బానిసైన బాయ్ ఫ్రెండ్ అజయ్ డిజెగా పనిచేసేవాడు. అయితే లాక్ డౌన్ కారణంగా పనులు లేక డబ్బులకు ఇబ్బందులు ఎదురవ్వడంతో ప్రేమికురాలి చైన్ తీసుకుని అమ్మేశాడు. 

అప్పటికి డబ్బులు సరిపోకపోవడంతో ప్రియురాలి తో కలిసి వాళ్ళ నాయనమ్మ ఇంట్లోనే 18 తులాల బంగారం దొంగతనం చేసి చివరికి ఇద్దరు కటకటాల పాలయ్యారు. పోలీసులు నిందితుని వద్ద నుండి బంగారం స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించారు.