ఆరేళ్ల పాలనలో టీఆర్ఎస్ వన్నీ వైఫల్యాలేనని, హైదరాబాద్ కు కాంగ్రెస్ చేసిన అభివృద్ధిని టీఆర్ఎస్ తన ఖాతాలో వేసుకుంటుందని, అసలు టీఆర్ఎస్ కి ఎందుకు ఓటు వేయాలనే కరపత్రాలను టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి షబ్బీర్ అలీ విడుదల చేశారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ... 

హైదరాబాద్ మెట్రో రైల్ 17000కోట్లు మాది అని కేటీఆర్ అంటున్నాడు. ఇన్ని అబద్ధాలు ఎలా చెప్తారని కాంగ్రెస్ నేత షబ్లీర్ అలీ ప్రశ్నించారు. మెట్రోరైలు ఫౌండేషన్ వేసింది కాంగ్రెస్ అని, ఆ సమయంలో ఆనాడు ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి, నేను హైదరాబాద్ ఇంచార్జ్ మినిస్టర్ గా ఉన్నానన్నారు. 

హైదరాబాద్ కు ఔటర్ రింగ్ రోడ్, ఎయిర్పోర్ట్, కృష్ణ గోదావరి నీళ్లు కాంగ్రెస్ తెచ్చిందని, 45 లక్షల ఇళ్లు నిర్మించామని అన్నారు. కేసీఆర్ లక్ష ఇల్లు అని చెబుతున్నాడు ఎక్కడ కట్టాడో చూపించాలని డిమాండ్ చేశారు. 

కేటీఆర్ కు సిగ్గుందా? అని ప్రశ్నించారు. సెక్రెటరియట్, అందులో ఉన్న మస్జిద్ లు కూల్చారన్నారు. 12 శాతం ముస్లిం రిజర్వేషన్లు అన్నవ్ ఇచ్చావా? అని ప్రశ్నించారు.  ఓట్లకోసం కేంద్రమంత్రులు వస్తున్నారు.. వరదలప్పుడు ఎందుకు రాలేదని ప్రశ్నిస్తున్న కేటీఆర్.. మీ నాన్న కేసీఆర్ వరద ప్రాంతల్లో ఎందుకు పర్యటించలేదని, మీ డాడీ ఏమైనా రాజా? అని ప్రశ్నించారు. 

బీజేపీ నేత బండి సంజయ్ సర్జికల్ స్ట్రైక్ అంటున్నాడు, ఎవరి మీద చేస్తాడో మరి.. అసలు 
సర్జికల్ స్ట్రైక్ ఎందుకు చేస్తారో తెలుసా? బండి సంజయ్ అంటూ ప్రశ్నించారు. పదో తరగతి కూడా పాసయ్యాడో లేదో తెలియదని ఎద్దేవా చేశారు. బీజేపీ, టీఆర్ఎస్, ఎంఐఎం ముగ్గురూ అమిత్ షా కనుసళ్ళలోనే పనిచేస్తున్నారని దుయ్యబట్టారు.