హైదరాబాద్ షేక్ పేట్ లోని ఓ పెట్రోల్ బంకులో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. చిన్నగా ప్రారంభమైన మంటలు బంకు మొత్తాన్ని వ్యాప్తించాయి. అంతకంతకు ఎగిసిపడుతున్న మంటలు స్ధానిక ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి.

ఓ కారులో పెట్రోల్ పోస్తుండగా ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. ఈ మంటలు పెరిగి బంకు మొత్తాన్ని వ్యాపించాయి. ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్ముకోవడంతో భయానక వాతావరణం నెలకొంది. 

read more  చోరీలకు ఆ ప్రాంతాలే టార్గెట్... గుమార్ గ్యాంగ్ ఆటకట్టించిన పోలీసులు

బంకులో భారీగా పెట్రలో స్టాక్ వుండటంతో ఆందోళన నెలకొంది. అయితే ఇప్పటికే అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు. మంటలు పెట్రోల్ నిల్వచేసే ట్యాంక్ కు అంటుకోకుండా జాగ్రత్త పడుతున్నారు. 

మంటలు వ్యాపించిన సమయంలో కారులో నలుగురు ప్రయాణికులున్నారు. ప్రమాదాన్ని గ్రహించిన వీరు వెంటనే కారులోంచి కిందకు దూకేయడంతో ప్రమాదం తప్పింది. అలాగే బంకులోని సిబ్బంది కూడా అప్రమత్తమవడంతో ఈ ఫైర్ యాక్సిడెంట్ లో ఎలాంటి  ప్రాణనష్టం చోటుచేసుకోలేదు. దీంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు.