మద్యం మత్తులో అపస్మారకంగా పడివున్న ఓ యువతిని బంజారాహిల్స్ పోలీసులు కాపాడి, స్టేషన్ కు తీసుకురాగా, మెలుకువ వచ్చిన తరువాత ఆమె హ‌ల్‌చ‌ల్‌ చేసింది. వివరాల్లోకి వెళితే.. శనివారం రాత్రి లీసా లీసా అనే యువతి రోడ్డుపై పూటుగా మ‌ద్యం సేవించి పడి ఉండటాన్ని గమనించిన పోలీసులు, ఆమెను స్టేషన్ కు చేర్చారు.

ఆ యువతి పోలీస్ స్టేషన్ నుండి పారిపోయేందుకు ప్రయత్నించగా, మహిళా పోలీసులు అడ్డుకున్నారు. ఆమెను గట్టిగా పట్టుకుని అదుపు చేసిన పోలీసులు, వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించగా, అంతు చూస్తానని బెదిరించింది.

లీసా నాగాలాండ్ నుంచి వచ్చిందని, మాదాపూర్ ప్రాంతంలోని ఓ ఐటీ కంపెనీలో పని చేస్తోందని పోలీసులు గుర్తించారు. ఇక ఆమె డ్రగ్స్ తీసుకుందా.. లేక మద్యం మత్తులో ఉందా అన్న విషయాన్ని తేల్చేందుకు రక్త పరీక్షలు నిర్వహిస్తున్నామని, ఆపై ఆమె తల్లిదండ్రులను పిలిపించి అప్పగిస్తామని పోలీసులు తెలిపారు

కొద్దిరోజుల క్రితం మద్యం మత్తులో ఇద్దరు అమ్మాయిలు శనివారం అర్ధరాత్రి హైద్రాబాద్‌లో హంగామా చేశారు.బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్క్‌ సమీపంలో కారులో  వచ్చిన ఇద్దరు యువతులు ఒకరిపై ఒకరు పరుష పదజాలంతో తిట్టుకొన్నారు. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 

కేబీఆర్ పార్క్ సమీపంలో ఇద్దరు యువతులు రోడ్డుపై నిలబడి తిట్టుకొన్నారు.  అంతేకాదు ఒకరిపై మరోకరు దాడికి పాల్పడ్డారు.  ఈ విషయం తెలిసిన పోలీసులు కేబీఆర్ పార్క్‌ వద్దకు చేరుకొన్నారు.  

యువతులకు ఎంత నచ్చజెప్పినా యువతులు వినలేదు. పోలీసులతో కూడ ఆ యువతులు దురుసుగా ప్రవర్తించారు.దీంతో కేబీఆర్ పార్క్ సమీపంలో కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయమేర్పడింది. ఆరుగురు స్నేహితులు మద్యం మత్తులో గొడవకు దిగారు.  ఆరుగురు స్నేహితుల్లో ఈ ఇద్దరు యువతులున్నారు.  పీకల దాకా మద్యం తాగి రచ్చ రచ్చ చేశారు. 

ఇదిలా ఉంటే  జూబ్లీహిల్స్‌లో  పోలీసుల తనిఖీలో మద్యం తాగిన పోలీసులు ఇద్దరు నైజీరియన్లు చుక్కలు చూపించారు.ట్రాఫిక్ ఇన్స్ పెక్టర్ ప్రసాదరావుతో దురుసుగా ప్రవర్తించారు. వీరిపై కూడ పోలీసులు కేసు నమోదు చేశారు.